Tammareddy Bharadwaj: సినిమా టికెట్ల రేట్ల ఇష్యూ చాలా చిన్నది.. ఏపీ ప్రభుత్వానికి తమ్మారెడ్డి సూచనలు..
సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తనదైన తరహాలో స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని..
సినిమా టికెట్ రేట్ల (Cinema Tickets Issue) వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం(AP GOVT) తీసుకున్న నిర్ణయంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Producer Tammareddy Bharadwaj) తనదైన తరహాలో స్పందించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని.. టికెట్ రేట్లు విషయం చాలా చిన్నదన్నారు. సినిమా పరిధి పెరిగింది.. ఇంతకు ముందు టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మాం.. ట్యాక్సులు కట్టలేదు. ఇప్పుడు రేట్లు తగ్గించారు.. రెవిన్యూ రావడం లేదన్నారు. అందుకే ఇప్పుడు ట్యాక్స్ కడతామని అంటున్నామన్నారు. రీజనబుల్ రేట్లు ఫిక్స్ చేయమంటున్నామన్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేటు పెంచాలని కోరడం కరెక్ట్ కాదన్నారు తమ్మారెడ్డి.
ఒక చోట టికెట్ రేటు తగ్గితే సమస్య కాదని అభిప్రాయ పడ్డడారు. చిత్ర నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయాయని.. వాటిని నియంత్రించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు మాట్లాడినా పరిశ్రమ మొత్తం కోసం మాట్లాడాలని గుర్తు చేశారు. ప్రభుత్వం కూడా గుర్తింపు ఉన్న సంస్థలతో చర్చలు జరపాలిని సూచించారు. వ్యక్తిగతంగా చర్చలు కరెక్ట్ కాదని.. చిరంజీవితో చర్చలు చేయండి.. ఛాంబర్ ప్రతినిధులను కూడా పిలవండి తమ్మారెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు.
థియేటర్లలో చెకింగ్ లు మొదలు పెట్టారన్నారు. ఎక్కువరేట్లు అమ్ముకోవడానికి వీలు కావడం లేదన్నారు. ఎవరు మాట్లాడినా పరిశ్రమకోసం మాట్లాడండని తెలిపారు. గుర్తింపు ఉన్న సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రెండు ప్రభుత్వాలకి చాలాసార్లు తెలియజేశామని చెప్పారు.
ఇవి కూడా చదవండి: Tukkuguda: అధికార టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్
UP Elections: ఎస్పీలో అఖిలేష్ యాదవ్ మేనమామ శివపాల్‌కు అవమానం! బీజేపీలో చేరిన పీఎస్పీ నేతలు..