Kalki 2898 AD : భైరవ గుండెల్లో నిలిచిపోతాడు.. కల్కిలో ప్రభాస్ పాత్రపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణే, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దాదాపు ఆరు వేల సంవత్సరాల నాటి వెనక స్టోరీ అని గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ రివీల్ చేశారు. మహాభారతం ఇతిహాసం ఆధారంగా ఈ మూవీ స్టోరీని రూపొందించామని అన్నారు.

సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత వరుసగా డిజాస్టర్స్ అందుకున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఆ సమయంలో రిలీజ్ అయిన సలార్ భారీ విజయాన్ని అందుకుంది. మరోసారి యంగ్ రెబల్ స్టార్ మాస్ నటవిశ్వరూపాన్ని బిగ్ స్క్రీన్ పై చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడే అదే స్థాయిలో రూపొందుతున్న చిత్రం కల్కి 2898 AD. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణే, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దాదాపు ఆరు వేల సంవత్సరాల నాటి వెనక స్టోరీ అని గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ రివీల్ చేశారు. మహాభారతం ఇతిహాసం ఆధారంగా ఈ మూవీ స్టోరీని రూపొందించామని అన్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కల్కి ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేశారు నిర్మాత స్వప్నదత్. ఇటీవల సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆమె కల్కి సినిమాపై ఇంట్రెస్టింగ్ చేశారు. కల్కి సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర చాలా కాలం అడియన్స్ గుండెల్లో నిలిచిపోతుందని అన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ప్రభాస్ పాత్ర గురించి అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో.. అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈ మూవీ వాయిదా పడనుందనే ప్రచారం నడుస్తుంది. ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా ఎన్టీఆర్ దేవరకు పోటీగా రానుందంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మేకర్స్ స్పందించలేదు. ప్రస్తుతం ప్రభాస్ కల్కితోపాటు.. రాజాసాబ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే సలార్ 2, స్పిరిట్ చిత్రాల్లో నటించనున్నారు.
#news producer Swapna Dutt about #Prabhas pic.twitter.com/2UxnIzqUtQ
— devipriya (@sairaaj44) March 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
