
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్‌స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ పట్టించుకోకుండా బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. త్వరలోనే విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ దగ్గర నుంచి ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. రేపు (జులై 31)న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తూ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.
తాజాగా కింగ్‌డమ్ సినిమా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అలాగే సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. ఇప్పుడు బుకింగ్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. అందరూ హిట్ కొట్టబోతున్నం అని చెప్తుంటే ఆనందంగా ఉందని విజయ్ అన్నారు. అలాగే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి ప్రేక్షకుల ప్రేమ కారణం అని అన్నారు.
నాగ వంశీ మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్‌లో కథ చెప్పడం గురించి మాట్లాడారు. ప్రేక్షకులు సినిమా పై తప్పుడు అంచనాలు పెట్టుకొని సినిమాకు రాకూడదు. అందుకే సినిమాలో కథ చెప్పాం అని నాగ వంశీ అన్నారు. ఇప్పుడు బుకింగ్స్ చూస్తుంటే సినిమా మంచి ఓపినింగ్స్ సాదిస్తుందని అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. దర్శకుడు గౌతమ్ ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుంది అని నాగ వంశీ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి