
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవల తన కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన అన్వై బర్త్ డే వేడుకలకు పలువురు సినీ ప్రముఖు హాజరయ్యారు. దిల్‌రాజు కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు, మహేశ్ బాబు, వెంకటేశ్, గోపీచంద్, శ్రీలీల, రాశీఖన్నా, సురేష్ బాబు, త్రివిక్రమ్, వక్కంతం వంశీ తదితరులు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అన్వైను ఆశీర్వదించారు. కాగా తన కుమారుడి బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు దిల్‌రాజు. ఇందుకోసం మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రత్యేకంగా ఓ పాటను కూడా కంపోజ్ చేశాడు. ప్రముఖ సింగర్ కార్తిక్ ఈ పాటను ఆలపించారు. ఇటీవలే యూట్యూబ్‌లోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. దిల్‌రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అన్వైతో సరదాగా గడిపిన క్షణాలను ఈ వీడియోలో మనం చూడవచ్చు. ముఖ్యంగా దిల్‌రాజు తనయుడిపై మనవడు నీళ్లు పోస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.
కాగా దిల్‌రాజు సతీమణి 2017లో కన్నుమూశారు. ఆ తర్వాత 2020లో తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారాయన. వీరికి 2022 జూన్ 29న అన్వై పుట్టాడు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ జే సూర్య విలన్‌గా కనిపించనున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..