నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ బింబిసార(Bimbisara). చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ సాలిడ్ హిట్ అందుకున్నారు. పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ హిస్టారికల్ మూవీలో నటించి మెప్పించారు కళ్యాణ్ రామ్ . సినిమా విడుదలకు ముందునుంచే ఈ సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కళ్యాణ్ రామ్. ఆయన నమ్మకాన్ని నిలబెట్టారు ప్రేక్షకులు. బింబిసార సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ వైపు అడుగులేస్తోంది. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన విశ్వరూపంతో మెప్పించారు. కళ్యాణ్ రామ్ నటనకు థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ అంతా ఆనందంలో తేలేలిపోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు. ఈ సినిమాను 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయనున్నారని తెలిపారు. అంటే సెప్టెంబర్ 23న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అతి పెద్ద ఓపెనింగ్స్ ఈ సినిమావే కావడం విశేషం. మొదటిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా..ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది బింబిసార. ఈ సినిమాలో కేథరిన్, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..