AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahanati: మహానటి కోసం ముందు అనుకుంది కీర్తిని కాదట.. మద్యం సీన్స్ ఉన్నాయని మూవీకి నో చెప్పిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయింది. ఆమె నటకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం వరించింది. మహానటి సావిత్రిని మైమరపించి.. నటనతో సినీ విమర్శకులను మెప్పించింది. ఈ మూవీ కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

Mahanati: మహానటి కోసం ముందు అనుకుంది కీర్తిని కాదట.. మద్యం సీన్స్ ఉన్నాయని మూవీకి నో చెప్పిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా?
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2022 | 10:08 AM

Share

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి (Mahanati) సినిమా ఏ రెంజ్‏లో హిట్ అయ్యిందో తెలిసిందే. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయింది. ఆమె నటకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం వరించింది. మహానటి సావిత్రిని మైమరపించి.. నటనతో సినీ విమర్శకులను మెప్పించింది. ఈ మూవీ కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. కీర్తి కెరీర్‏లో ది బెస్ట్ మూవీగా నిలిచింది ఈ సినిమా. అయితే ఈ సినిమా కోసం ముందుగా కీర్తి సురేష్‏ను అనుకోలేదట. మలయాళీ నటిని తీసుకోవాలని ఆమెను సంప్రదించగా.. మద్యం సీన్స్ ఉంటే తాను చేయనని చెప్పడంతో.. ఈ ఆఫర్ కీర్తిని వరించిందట. ఈ విషయాన్ని చిత్రనిర్మాత అశ్విని దత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కేవలం మద్యం సీన్స్ కోసం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని వదులుకున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసుకుందామా.

ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఇటీవల ఆలీతో సరదగా షోలో పాల్గోని వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ తీయాలనుకున్నామని తెలిపారు. ముందుగా ఓ మలయాళీ నటిని అనుకున్నాం. మనం సావిత్రి బయోపిక్ తీస్తున్నాం కదా. చివరలో ఆ తాగుడు సీన్స్ ఉండవు కదా. అలాంటివి ఉంటే చేయను అని చెప్పిందని నాతో ఎవరో అన్నారు. స్క్రిప్ట్ పై కామెంట్ చేయడానికి ఆమె ఎవరు ? ఆ అమ్మాయిని తీసుకోవద్దు అని నేనే చెప్పాను. నాలుగైదు రోజుల తర్వాత కీర్తికి కథ చెప్పడంతో ఆమె ఓకె చెప్పింది. ఒకవేళ ఆ మలయాళ నటి ఈ సినిమా చేసి ఉంటే మంచి పేరు వచ్చేది. ఎందుకంటే సావిత్రి గారి పాత్రను తను సులభంగా చేస్తుంది. కానీ కీర్తి చేయడంతో అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు.

Nithya Menen, Savitri

Nithya Menen, Savitri

అయితే గతంలో మహానటి సినిమా అనౌన్స్ చేసిన సమయంలో హీరోయిన్ నిత్యా మీనన్ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా సావిత్రి పాత్రలో ఆమె పాత్రలు కొన్ని బయటకు వచ్చాయి. కేవలం మద్యం సీన్స్ చేయనంటూ బ్లాక్ బస్టర్ హిట్ వదులుకుందంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి
Keerthy Suresh, Savitri

Keerthy Suresh, Savitri

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.