Priyamani: డైరెక్టర్అట్లీ మోసం చేశారు.. షాకింగ్ విషయం చెప్పిన ప్రియమణి
తెలుగులో దాదాపు కుర్రహీరోలందరి సరసన నటించింది. అలాగే స్టార్ హీరోలతో కూడా జతకట్టింది నాగార్జున తో కలిసి రగడ, వెంకటేష్ తో కలిసి నారప్ప సినిమాలో నటించి మెప్పించింది. ఇక తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ప్రియమణి. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించింది ప్రియమణి. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన చైన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఇప్పుడు జవాన్ లో కనిపించింది.
ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ప్రియమణి. పెళ్ళైన కొత్తలో సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగులో దాదాపు కుర్రహీరోలందరి సరసన నటించింది. అలాగే స్టార్ హీరోలతో కూడా జతకట్టింది నాగార్జున తో కలిసి రగడ, వెంకటేష్ తో కలిసి నారప్ప సినిమాలో నటించి మెప్పించింది. ఇక తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ప్రియమణి. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించింది ప్రియమణి. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన చైన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఇప్పుడు జవాన్ లో కనిపించింది.
ఇదిలా ఉంటే దర్శకుడు అట్లీ తనను మోసం చేశాడని తెలిపారు ప్రియమణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి మాట్లాడుతూ.. దర్శకుడు అట్లీ వీడియో కాల్ లో మాట్లాడుతూ.. జవాన్ సినిమాలో నటించమని అడిగారు. అయితే నేను స్పెషల్ సాంగ్ అని అనుకున్నా కానీ ఆతర్వాత కీ రోల్ అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో దళపతి విజయ్ అతిథి పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది నిజమేనా అని అడిగాను.
View this post on Instagram
దానికి విజయ్ గారితో చేపించేస్తే పోతుంది ఏముంది అన్నాడు. అలాగే నాకు విజయ్ కు ఒక సన్నివేశం ఉండేలా చూడండి అని కూడా అడిగాను దానికి అట్లీ సరే అని అన్నాడు. కానీ ఆతర్వాత విజయ్ నటించలేదు. అట్లీ నన్ను మోసం చేశాడు అని సరదాగా తెలిపారు ప్రియమణి.
View this post on Instagram
అలాగే జైలు లో ఓ సాంగ్ లో కొరియోగ్రాఫర్ తాను షారుక్ వెనక నుంచోమని అన్నారట. అయితే షారుక్ మాత్రం తన పక్కనే ఉండాలని ఆమెను తీసుకువచ్చి పక్కన నిలుచోబెట్టారు అని ప్రియమణి తెలిపారు. ఇక జవాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 700 కోట్ల వరకు వసూల్ చేసింది జవాన్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.