- Telugu News Photo Gallery Cinema photos KGF star Yash to soon start shooting with Geetu Mohandas for his next film
Yash: సెట్స్ పైకి రానున్న రాకీభాయ్.. ఈ ఏడాది చివర్లో షూట్ మొదలు..
ఒక్క 1000 కోట్ల సినిమా పడితే హీరోలింతగా కంగారు పడతారా..? కన్ఫ్యూజన్‌లో పడి.. ఎలాంటి కథలు చేయాలో కూడా తెలియక క్లారిటీ మిస్ అవుతారా..? కావాలంటే సాక్ష్యంగా కేజియఫ్ స్టార్ యశ్‌నే తీసుకోండి.. ఆ మత్తులోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు రాఖీ భాయ్. ఈయన నెక్ట్స్ సినిమా ఇంకా డైలమాలోనే ఉంది.. దానికి తోడు యశ్ 19పై మరో పిడుగు లాంటి వార్త వచ్చిందిప్పుడు. బాహుబలితో ప్రభాస్ ఎలా పాన్ ఇండియా స్టార్ అయ్యారో.. కేజియఫ్‌తో యశ్ కూడా అంతే. అప్పటి వరకు 50 కోట్లున్న ఈయన మార్కెట్ కాస్తా.. కేజియఫ్‌తో 1000 కోట్లకు పెరిగింది.
Updated on: Sep 13, 2023 | 12:50 PM

ఒక్క 1000 కోట్ల సినిమా పడితే హీరోలింతగా కంగారు పడతారా..? కన్ఫ్యూజన్‌లో పడి.. ఎలాంటి కథలు చేయాలో కూడా తెలియక క్లారిటీ మిస్ అవుతారా..? కావాలంటే సాక్ష్యంగా కేజియఫ్ స్టార్ యశ్‌నే తీసుకోండి.. ఆ మత్తులోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు రాఖీ భాయ్. ఈయన నెక్ట్స్ సినిమా ఇంకా డైలమాలోనే ఉంది.. దానికి తోడు యశ్ 19పై మరో పిడుగు లాంటి వార్త వచ్చిందిప్పుడు.

బాహుబలితో ప్రభాస్ ఎలా పాన్ ఇండియా స్టార్ అయ్యారో.. కేజియఫ్‌తో యశ్ కూడా అంతే. అప్పటి వరకు 50 కోట్లున్న ఈయన మార్కెట్ కాస్తా.. కేజియఫ్‌తో 1000 కోట్లకు పెరిగింది. దాంతో ప్రెజర్ కూడా 100 రెట్లు పెరిగింది. అందుకే నెక్ట్స్ సినిమా విషయంలో సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు యశ్. ఏడాదిగా ఎన్నో కథలు వింటున్నా.. ఇప్పటికీ అధికారికంగా ఇదే నా తర్వాతి సినిమా అని చెప్పలేదు యశ్.

మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్‌తో యశ్ నెక్ట్స్ సినిమా దాదాపు ఖరారైపోయింది. ఇప్పటికే నెరేషన్ అయిపోయింది.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అక్టోబర్ తర్వాతే ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుంది.

అప్పటి వరకు ఫ్యాన్స్‌కు ఎదురు చూపులైతే తప్పవు. కేజియఫ్ తరహాలో ఇది కూడా గ్యాంగ్ స్టర్ డ్రామానే.. మరోసారి మాఫియా కథతోనే వస్తున్నారు రాకింగ్ స్టార్.

పాన్ ఇండియా మార్కెట్ నిలబడాలంటే.. మాఫియా బ్యాక్‌డ్రాప్‌ను మించిన ఆప్షన్ మరోటి లేదని నమ్ముతున్నారు యశ్. అందుకే ఎన్నో కథలు విన్నా.. చివరికి గీతూ సబ్జెక్ట్‌కే ఓకే చెప్పారు. అంతా బాగానే ఉన్నా.. కేజియఫ్ తీసుకొచ్చిన ఇమేజ్ యశ్‌పై మోయలేని భారాన్ని పెట్టేసింది. మరి దీన్ని కొత్త గ్యాంగ్‌స్టర్ డ్రామాతో ఓవర్ కమ్ చేస్తారా..? అసలు నెక్ట్స్ ప్రాజెక్ట్ మొదలు పెట్టేదెప్పుడో చూడాలి.




