- Telugu News Photo Gallery Cinema photos Malayalam heroes new looks with versatile characters will surprise you
న్యూ లుక్స్‌లో మాలీవుడ్ స్టార్‌లు.. చూస్తే ఆశ్చర్యపోతారంతే.!
మలయాళం స్టార్ హీరోలు కొత్త లుక్స్ ట్రై చేస్తున్నారు. ఒక్కో సినిమాకు.. ఒక్కో లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఈ మలయాళం సూపర్ స్టార్‌లు. 72 ఏళ్ల వయసులోనూ డిఫరెంట్ రోల్స్ చేస్తూ వావ్ అనిపిస్తున్నారు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి. ప్రజెంట్ అరడజను సినిమాల్లో నటిస్తున్న ఈ టాప్ హీరో... భ్రమయుగం మూవీ కోసం డిఫరెంట్ గెటప్ ట్రై చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది.
Updated on: Sep 13, 2023 | 1:31 PM

మలయాళం స్టార్ హీరోలు కొత్త లుక్స్ ట్రై చేస్తున్నారు. ఒక్కో సినిమాకు.. ఒక్కో లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఈ మలయాళం సూపర్ స్టార్‌లు.

72 ఏళ్ల వయసులోనూ డిఫరెంట్ రోల్స్ చేస్తూ వావ్ అనిపిస్తున్నారు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి. ప్రజెంట్ అరడజను సినిమాల్లో నటిస్తున్న ఈ టాప్ హీరో... భ్రమయుగం మూవీ కోసం డిఫరెంట్ గెటప్ ట్రై చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది.

మరో సీనియర్ హీరో మోహన్‌లాల్ కూడా డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నారు. ఇన్నాళ్లు లుక్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయని ఈ కంప్లీట్ యాక్టర్, తన ఓన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న బరోజ్ మూవీ కోసం లాంగ్ హెయిర్‌తో ఒక లుక్, గుండుతో మరో లుక్‌లో కనిపించబోతున్నారు.

పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా లుక్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు మేకప్‌లోనే వేరియేషన్స్ చూపించిన పృథ్వీరాజ్, తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం భారీ రిస్క్ చేశారు. ఆడు జీవితం సినిమా కోసం భారీగా బరువు తగ్గటంతో పాటు జుట్టు, గడ్డంతో డిఫరెంట్ గెటప్‌లో నటించారు.

తాజాగా మరో మలయాళ స్టార్ జయసూర్య కూడా లుక్ మార్చేశారు. హారర్ కథతో తెరకెక్కుతున్న కథనార్ సినిమా కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు. అనుష్క కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మాంత్రికుడి పాత్రలో నటిస్తున్నారు ఈ మాలీవుడ్ స్టార్ హీరో.




