Deepika Padukone: బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. ఫొటోస్ వైరల్
ముంబైలోని 6 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ముంబైలో ఓటింగ్ కాబట్టి చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఓటు వేయడం వేయడానికి వచ్చారు. ఉదయం నుంచే పోలింగ్ బూత్ వద్ద తారల రద్దీ నెలకొంది. ఇప్పటికే చాలా మంది స్టార్స్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.అలాగే స్టార్ కపుల్ దీపికా పదుకొనే , రణవీర్ సింగ్ కూడా ఓటు వేయడానికి వారి పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలలో ఐదో దశ ఓటింగ్ సోమవారం జరుగుతోంది. ఐదో దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ సీట్లలో మహారాష్ట్రలోని 13 సీట్లు కూడా ఉన్నాయి. వీటిలో ముంబైలోని 6 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ముంబైలో ఓటింగ్ కాబట్టి చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఓటు వేయడం వేయడానికి వచ్చారు. ఉదయం నుంచే పోలింగ్ బూత్ వద్ద తారల రద్దీ నెలకొంది. ఇప్పటికే చాలా మంది స్టార్స్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.అలాగే స్టార్ కపుల్ దీపికా పదుకొనే , రణవీర్ సింగ్ కూడా ఓటు వేయడానికి వారి పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు.
దీపికా పదుకొణె గర్భవతి అన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆమె బేబీ బంప్ లుక్ మొదటిసారి కనిపించింది. దీపికా పదుకొణె తన భర్త, నటుడు రణవీర్ సింగ్‌తో కలిసి పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో, రణవీర్ సింగ్ దీపికాను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దీపికా పై జనం పడకుండా.. అలాగే కారు నుంచి దించడం కూడా కనిపించింది. కారు దిగిన తర్వాత ఇద్దరూ నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు.
ఈ సమయంలో, దీపికా పదుకొణె నల్ల కళ్లద్దాలు పెట్టుకొని తెల్లటి పొడవాటి చొక్కాలో కనిపించింది. అదే సమయంలో, రణవీర్ సింగ్ కూడా తెల్లటి చొక్కా , జీన్స్‌లో కనిపించాడు. దీపిక ప్రెగ్నెన్సీ గురించి ఇటీవలి కాలంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ పిక్చర్ తొలిసారిగా బయటకు వచ్చింది.
చాలా మంది స్టార్లు ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హృతిక్ రోషన్, రాకేష్ రోషన్, సలీం ఖాన్, ధర్మేంద్ర, హేమ మాలిని, ఈషా డియోల్, సునీల్ శెట్టి, రణదీప్ హుడా, అనిల్ కపూర్, విద్యాబాలన్, బోనీ కపూర్, ఖుషీ కపూర్, జాన్వీ కపూర్ ఓటు వేశారు. హృతిక్ రోషన్ ఓటు వేసిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను షేర్ చేశాడు. “వెళ్లి ఓటు వేయండి. అలాగే మీరు ముందుగానే అభ్యర్థి గురించి సమాచారాన్ని సేకరించారని నిర్ధారించుకోండి. “మొదట మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో తెలుసుకోండి.” అని రాసుకొచ్చాడు.
దీపికా రణవీర్ సింగ్ , దీపికా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.