బాలయ్య-బోయపాటి సినిమాలో హీరోయిన్ ఈమే !
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తాజాగా ఓ సినిమా తెరకెక్కతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలయ్య పుట్టినరోజున రిలీజైన ఈ సినిమా ఫస్ట్ రోర్ ప్రేక్షకులను అలరించింది.
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తాజాగా ఓ సినిమా తెరకెక్కతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలయ్య పుట్టినరోజున రిలీజైన ఈ సినిమా ఫస్ట్ రోర్ ప్రేక్షకులను అలరించింది. ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా బాలయ్య రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో సస్పెన్స్ నెలకుంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చినా..అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా బాలయ్యతో ఆడిపాడే హీరోయిన్ ఫిక్స్ అయిపోయింది. మలయాళీ ముద్దుగుమ్మ ప్రగ్యా మార్టిన్ ఈ సినిమాలో బాలయ్య సరసన ఆడిపాడనుంది. క్లాసికల్ డ్యాన్సర్, మోడల్ అయిన ప్రగ్యా మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగానూ నటించి..ఆపై హీరోయిన్‌గా మారింది. తమిళనాట ‘పిశాచి’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ నటించిన ఉస్తాద్ హోటల్ మూవీలో కామియో అప్పిరియన్స్ ఇచ్చింది. ( దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై ! )
పలు మలయాళ సినిమాల్లో నటించి పాపులర్ అయిన ప్రగ్యా మార్టిన్‌ను, బాలయ్యకు జోడీగా ఫైనల్ చేశారు. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. నవంబర్‌లో షూటింగ్ తిరిగి పున:ప్రారంభం కానుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పలవురు మలయాళ ముద్దుగుమ్మలను తెలుగు చిత్ర సీమలో సత్తా చాటుతున్నారు. మరి ప్రగ్యా ఎంతమేర నెగ్గుకొస్తుందో చూడాలి. ( దివ్య కేసులో మరో సంచలనం, గతంలో ఆమె నాగేంద్ర ఏం చెప్పిందంటే..! )