Dude OTT: ఓటీటీలోకి ‘డ్యూడ్’!.. ఆ స్పెషల్ డే నుంచే ప్రదీప్ రంగనాథన్ వంద కోట్ల సినిమా స్ట్రీమింగ్
ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో డ్యూడ్ ఒకటి. ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుంది.

డ్యూడ్ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు కోలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. అంతకు ముందు ఈ హీరో నటించిన లవ్ టుడే, డ్రాగన్ సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఇప్పుడు డ్యూడ్ సినిమాతో మరో వంద కోట్ల సినిమాను ఖాతాలో వేసుకున్నాడు. కీర్తిశ్వరన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. డిజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి మరో కీలక పాత్రలో నటించింది. పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ డ్యూడ్ సినిమాను నిర్మించడం విశేషం. దసరా కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూడ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు సాధించింది. ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన డ్యూడ్ సినిమా ఇంకా చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోంది. అదే సమయంలో ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వీరి కోరిక నెరవేరనుంది. డ్యూడ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం దర్శక నిర్మాతలకు రూ.25 కోట్లకు పైగానే చెల్లించినట్లు తెలుస్తోంది. రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఈ రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడమంటే విశేషమనే చెప్పుకోవాలి.
కాగా డ్యూడ్ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే చిల్ట్రన్స్ డే కానుకగా నవంబర్ 14 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి డ్యూడ్ సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు టాక్ . త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. డ్యూడ్ సినిమాలో ఆర్ శరత్ కుమార్, రోహిణీ, ఐశ్వర్య శర్మ, వినోదిని వైద్యనాథన్, హ్రిదూ హిరోన్, సత్య, బీసెంట్ రవి తదతరులు ప్రధాన పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కు ఛాన్స్..
‘Supreme Star’ @realsarathkumar shows his versatility in this role 💥💥 Every scene of his 📈
Book your tickets for #Dude now 🔥 🎟️ https://t.co/JVDrRd4PZQ
⭐ing ‘The Sensational’ @pradeeponelife 🎬 Written and directed by @Keerthiswaran_ Produced by… pic.twitter.com/9cGBpJVnsG
— Mythri Movie Makers (@MythriOfficial) October 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








