Team India: ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్ ఫిక్స్..? ప్లేయింగ్-11 నుంచి నలుగురికి హ్యాండివ్వనున్న సూర్యకుమార్ యాదవ్..!
T20 World Cup 2026: సూర్యసేన ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడ విజయాలతో సూపర్ 8కు చేరుకుంది. మరో మ్యాచ్ ఉండగానే భారత జట్టు సూపర్ 8 చేరుకోవడం గమనార్హం. అయితే, ఫైనల్ వరకు కొంతమంది ఆటగాళ్లకు బెంచ్‌కే ఫిక్స్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

Team India Playing XI: సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీలోని భారత జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 (ICC T20I World Cup 2026)లో సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ అద్భుత విజయాలు సాధించి, టోర్నీలో తన ఆధిపత్యాన్ని చాటింది. ఆరంభంలో మూడు మ్యాచ్‌ల్లో భారత్ తన ప్లేయింగ్-11లో మార్పులు చేసింది. అయితే, సూపర్-8 దశ నుంచి ఫైనల్ వరకూ పెద్దగా మార్పులు లేకుండా ఒకే స్థిరమైన ప్లేయింగ్-11తోనే ముందుకు వెళ్లాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలో, జట్టు సమతుల్యత దృష్ట్యా నలుగురు ఆటగాళ్లు బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ప్లేయింగ్-11 నుంచి నలుగురు ఔట్..
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ప్రతిసారి ప్లేయింగ్-11లో మార్పులు చేశారు. తొలి మ్యాచ్‌లో మొహమ్మద్ సిరాజ్‌కు అవకాశం లభించగా, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లకు అతడిని పక్కన పెట్టారు. శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్‌ను తప్పించి, అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ స్థానంలో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. అయితే, సూపర్-8 నుంచి వచ్చే కీలక మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
సంజూ, కుల్దీప్ ఫామ్‌నే సమస్యగా మారిందా?
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం జట్టు ప్రకటించిన సమయంలో, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్‌గా సంజూ శాంసన్ టీమ్ మేనేజ్‌మెంట్ తొలి ఎంపికగా ఉన్నాడు. అయితే, న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 46 పరుగులే చేయడంతో, ఓపెనర్‌గా అతని స్థానంలో ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కింది.
ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో ఉండడంతో, ఫైనల్ వరకూ అతడే ఓపెనర్‌గా కొనసాగుతాడని భావిస్తున్నారు. మరోవైపు, పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం లభించింది. కానీ ఆ మ్యాచ్‌లో అతడు 3 బంతుల్లోనే 14 పరుగులు ఇచ్చాడు. మూడు ఓవర్లలో కూడా అతడికి సరైన లయ కనిపించలేదు. అంతేకాకుండా, అతని ఫీల్డింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ కారణాలతో రాబోయే మ్యాచ్‌ల్లో కుల్దీప్‌కు అవకాశం దక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
సుందర్, సిరాజ్‌కూ బెంచ్‌కే..
వరల్డ్ కప్ 2026కి ఎంపికైన తొలి జట్టులో మొహమ్మద్ సిరాజ్ పేరు లేదు. అయితే హర్షిత్ రాణా గాయపడడంతో, అతని స్థానంలో సిరాజ్‌కు అవకాశం దక్కింది. యూఎస్‌ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో సిరాజ్ మూడు వికెట్లు తీసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయినప్పటికీ, టీమ్ మేనేజ్‌మెంట్ ప్రాధాన్యం ఎక్కువగా జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌లకే ఉండటంతో, సిరాజ్‌కు ఆడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది.
ఇక వాషింగ్టన్ సుందర్‌కు కూడా ప్రస్తుత ప్లేయింగ్-11లో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే, జట్టులో ఇప్పటికే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి లాంటి ప్రధాన స్పిన్నర్లు ఉన్నారు. అదనంగా తిలక్ వర్మ, రింకూ సింగ్, అభిషేక్ శర్మ కూడా అవసరమైతే స్పిన్ బౌలింగ్ చేయగలరు. అందుకే, కోచ్ గంభీర్ నంబర్-7 స్థానంలో ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌గా రింకూ సింగ్‌ను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
