Venu Swamy: వేణు స్వామితో స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు.. ఎవరో గుర్తుపట్టారా..?

సమంత, నాగ చైతన్య విడాకుల విషయంలో వేణు స్వామి చెప్పినట్టే జరిగింది. అలాగే కొంతమంది అనారోగ్యం పాలు అవుతారని, మరికొంతమంది మరణిస్తారని చెప్పారు వేణు స్వామి. దాంతో ఆయనకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. సెలబ్రిటీలు మొత్తం ఆయన చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. చాలా మంది హీరోయిన్ ఆయనతో పూజలు కూడా చేయించుకున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక కూడా వేణు స్వామితో పూజలు చేయించుకుంది.

Venu Swamy: వేణు స్వామితో  స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు.. ఎవరో గుర్తుపట్టారా..?
Venu Swami
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 25, 2024 | 1:59 PM

వేణు స్వామి.. ఈయన పేరు ఈ మధ్య కాస్త గట్టిగానే వినిపించింది. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సినీ సెలబ్రిటీల జాతకాలతో పాటు పలువురి రాజకీయనాయకుల జాతులకు కూడా చేస్తూ బాగా ఫెమస్ అయ్యారు. ఇండస్ట్రీలో ఆయన చెప్పినవి చాలా వరకు జరిగాయని నమ్ముతారు. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకుల విషయంలో వేణు స్వామి చెప్పినట్టే జరిగింది. అలాగే కొంతమంది అనారోగ్యం పాలు అవుతారని, మరికొంతమంది మరణిస్తారని చెప్పారు వేణు స్వామి. దాంతో ఆయనకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. సెలబ్రిటీలు మొత్తం ఆయన చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. చాలా మంది హీరోయిన్ ఆయనతో పూజలు కూడా చేయించుకున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక కూడా వేణు స్వామితో పూజలు చేయించుకుంది. రష్మిక మందన్నా, నిధి అగర్వాల్ స్టార్ హీరోయిన్స్ తో పాటు అషు రెడ్డి, ఇనాయ సుల్తానా లాంటి బ్యూటీస్ కూడా వేణు స్వామితో పూజలు చేయించుకున్నారు.

తాజాగా మరో హీరోయిన్ కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? రీసెంట్ డేస్ లో చాలా ఫెమస్ అయ్యింది ఆ చిన్నది. ఆమె మరెవరో కాదు ప్రభుదేవాతో డాన్స్ చేసి పేరు తెచ్చుకున్న కన్నడ యంగ్ హీరోయిన్ నిశ్విక నాయుడు కరటక దమనక అనే సినిమాలో ప్రభుదేవాతో కలిసి నటించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో ఓ సాంగ్ లో ప్రభు దేవతో పోటీ పడుతూ డాన్స్ చేసి మెప్పించింది.

ఇది కూడా చదవండి : తస్సాదీయ..! తమ్ముడు మూవీ హీరోయిన్ దుమ్మురేపిందిగా.. చూస్తే షేక్ అయ్యిపోవాల్సిందే

త్వరలోనే ఈ బ్యూటీ తెలుగులోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల వేణు స్వామి చెప్పిన విషయం జరగకపోవడంతో ఆయన పై భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం విజయం సాదిస్తుందని, జగన్ మరోసారి సీఎం అవుతారు అని చెప్పారు వేణు స్వామి కానీ అలా జరగలేదు. దాంతో ఆయన చెప్పేవి అబద్దాలు అని ట్రోల్ చేశారు నెటిజన్స్. దాంతో ఆయన ఇక పై రాజకీయాల పై జ్యోతిష్యం చెప్పను అని ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ పూజలు చేయించుకోవడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

నిశ్విక నాయుడు ఇన్ స్టా గ్రామ్ ..

View this post on Instagram

A post shared by Nishvika Naidu (@nishvika_)

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..