Prabhu Deva : సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుదేవా.. షాక్‌లో అభిమానులు..
సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ నటులు చాలా మంది ఉన్నారు. అలంటి వారిలో ప్రభుదేవా ఒకరు. కొరియోగ్రాఫర్ గా ఓ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు ప్రభుదేవా.
Prabhu Deva : సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ నటులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రభుదేవా ఒకరు. కొరియోగ్రాఫర్‌గా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు ప్రభుదేవా. ఆయనను ఇండియా మైకేల్ జాక్సన్ అంటారు అభిమానులు. అలాగే నటుడిగాను సక్సెస్ అయ్యారు. ప్రభుదేవా హీరోగా చాలా సినిమాలు వచ్చాయి. ఇక దర్శకుడిగాను మారి సక్సెస్ సాదించారు.. తెలుగులో ఆయన ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి అక్కడ బిజీ డైరెక్టర్‌గా మారాడు. తెలుగు సినిమాలను అక్కడి టాప్ హీరోలతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్నారు ప్రభుదేవా. ఇక ఇప్పుడు మరోసారి నటుడిగా గుర్తింపు తెచుకోవడంకోసం ప్రయత్నలు చేస్తున్నారు ప్రభుదేవా.. ఇక ప్రభుదేవా దర్శకుడిగా మారిన తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఒకరిద్దరు హీరోలకు మాత్రమే డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ మధ్య ప్రభుదేవా దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి.
సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభుదేవా తిరిగి చెన్నైకు చేరుకున్నారు. ఇక పై డైరెక్షన్ చేయకూడదని నిర్ణయించుకున్న ఆయన.. నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని చెబుతున్నారని తెలుస్తుంది. నటుడిగా వరుస అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భగీరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :