Nagarjuna’s Ghost Movie: నాగార్జున సినిమాకు నో చెప్పిన కాజల్.. చందమామ ప్లేస్‌ను రీప్లేస్ చేసేది ఆమేనా..

కింగ్ నాగార్జున కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఓవైపు సినిమాలతో మరో వైపు టీవీ షోలతో బిజీగా ఉన్నారు నాగ్.

Nagarjuna's Ghost Movie: నాగార్జున సినిమాకు నో చెప్పిన కాజల్.. చందమామ ప్లేస్‌ను రీప్లేస్ చేసేది ఆమేనా..
Kajal
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 21, 2021 | 9:36 AM

Nagarjuna’s Ghost : కింగ్ నాగార్జున కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఓవైపు సినిమాలతో మరో వైపు టీవీ షోలతో బిజీగా ఉన్నారు నాగ్. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతోప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్. ఇప్పుడు బంగార్రాజుగా రావడానికి సిద్ధమయ్యారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవలే పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతు సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. ఈ సినిమాతో పాటు ప్రవీణ్ సత్తార్‌తో సినిమాచేస్తున్నారు నాగార్జున. ఈ సినిమా గోస్ట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఇటీవల నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు విపరీతమైన రెస్పాన్ వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఇప్పుడు కాజల్ ప్రగ్నెట్ కావడంతో ఈ సినిమాలో ఆమె నటించడంలేదని తెలుస్తుంది. అయితే కాజల్ నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. అలాగే భారతీయుడు 2 సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. అయితే నాగ్ సినిమా మాత్రం పట్టాలపై ఉంది. దాంతో ఈ సినిమా చేయలేనని చెప్పేసిందట కాజల్. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్‌లోకి గోవా బ్యూటీ ఇలియానాను తీసుకోనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇలియానా చివరిగా టాలీవుడ్లో చేసిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. త్వరలోనే హీరోయిన్‌కు సంబంధించిన క్లారిటీ ఇవ్వనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెంచిన ప్రియ- లహరి.. చిన్నపాటి యుద్ధమే జరిగిందిగా..

Maha Samudram: ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్.. మహాసముద్రం ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..

Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..