Naatu Naatu Song: ప్రభుదేవా స్టైల్లో నాటు నాటు సాంగ్.. వీడియో అదిరిపోయిందంతే..

|

Mar 19, 2023 | 8:20 AM

తన టీంతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రెడ్ హార్ట్ సింబల్స్ తో విషెస్ చేశారు.

Naatu Naatu Song: ప్రభుదేవా స్టైల్లో నాటు నాటు సాంగ్.. వీడియో అదిరిపోయిందంతే..
Prabhu Deva
Follow us on

నాటు నాటు సాంగ్.. ఇప్పుడు ప్రపంచాన్ని సైతం మాస్ స్టెప్పులతో హూషారేత్తిస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ పాటకు వస్తోన్న రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవల బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ కైవసం చేసుకుంది ఈ సాంగ్. కేవలం ఆస్కార్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ ఈ పాటకు సలాం కొట్టాయి. దీంతో మరోసారి ఈ పాటకు కాలు కదుపుతున్నారు నెటిజన్స్. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ మైఖేల్ జాక్సన్.. స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ కు తన శుభాకాంక్షలు తెలిపారు. తన టీంతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రెడ్ హార్ట్ సింబల్స్ తో విషెస్ చేశారు.

ప్రభుదేవా డాన్స్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రతి పాటలోనూ సరికొత్త స్టెప్పులతో ఆ సాంగ్ విజువల్ చేంజ్ చేస్తుంటారు. ఆయన డాన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ప్రభుదేవా.. ఇప్పుడు నాటు నాటు పాటకు స్టెప్పులేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మీరు సూపర్ మాస్టర్.. ట్రిపుల్ ఆర్ చిత్రటీంకు ఇది బెస్ట్ ట్రిబ్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఆస్కార్ అవార్డ్స్ వేడుకల నుంచి తిరిగివచ్చిన జక్కన్న తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. జక్కన్న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవలే మహేష్ బాబును జక్కన్న కలిసి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.