Salaar Movie: కౌంట్ డౌన్ స్టార్ట్.. మార్కెట్లోకి ‘సలార్’ షర్ట్స్.. ధరెంత ఉందో తెలుసా ?..
భారీ బడ్జెట్తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే నెల అంటే డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వరల్డ్ వైడ్ సలార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఓవైపు సోషల్ మీడియాలో సలార్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నారు. దీంతో ఈ మూవీని చూసేందుకు అడియన్స్ తెగ ఆరాటపడుతున్నారు. భారీ బడ్జెట్తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే నెల అంటే డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వరల్డ్ వైడ్ సలార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఓవైపు సోషల్ మీడియాలో సలార్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.
ఇదిలా ఉంటే.. సలార్ సినిమా కోసం త్వరలోనే ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారట హోంబలే ఫిల్మ్స్. అటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని.. అలాగే అన్ని భాషల మీడియాతో ప్రభాస్ ఇంట్రాక్ట్ కానున్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటు సలార్ ప్రమోషన్స్ షూరు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సలార్ టీ షర్ట్స్ సందడి చేస్తున్నాయి. ప్రభాస్ అభిమానుల కోసం ఆన్ లైన్ లో వీటిని విక్రయిస్తున్నారు. హోంబలే వెర్సెస్ (hombaleverse) వెబ్ సైట్లో ఈ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. టీషర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్స్ కొనుగోలు చేయవచ్చు. టీషర్ట్స్ కావాలనుకున్న ఫ్యాన్స్ హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..రూ.499 నుంచి ప్రారంభమై రూ.1499 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
Rebel fans, this one’s for you! 💥#HombaleVerse presents the Inaugural Offer – Buy one get one FREE on #Salaar exclusive merchandise. – https://t.co/T9sVOpd3h2 @hombalefilms #SalaarStyle #SalaarMerchandise#SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22 pic.twitter.com/QXeC9TAzE6
— Hombale Films (@hombalefilms) November 25, 2023
ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను రెండు భాగాలుగా తీసువస్తున్నారు. గతంలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన కేజీఎఫ్ చిత్రానికి సలార్ మూవీకి లింక్ ఉంటుందని అంటున్నారు ప్రేక్షకులు. డిసెంబర్ 22న ఈ సినిమా షారుఖ్ నటించిన డుంకీ సినిమాతో పోటీ పడబోతుంది. ఈ క్రమంలోనే సలార్ ప్రమోషన్స్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Brace yourselves for a Cinematic Wardrobe Revolution! Introducing Hombale Films Merchandise, with the Powerhouse #Salaar Collection leading the way. Elevate your style with the essence of cinema. Unleash the magic – Dress, Feel, Live the Movies! 🎬https://t.co/T9sVOpdB6A… pic.twitter.com/NYNJR8W9Ml
— Hombale Films (@hombalefilms) November 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




