Salaar Movie : అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మరేపుతోన్న సలార్.. డంకీ పరిస్థితేంటంటే
షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ డిసెంబర్ 21 మరియు ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22 ఒక్క రోజు గ్యాప్ లో విడుదలవుతున్నాయి. తొలిరోజు ఈ సినిమాలు ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లను రాబడతాయో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల పై భారీ ఎక్స్ పెట్టేషన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇక రిలీజ్ డేట్స్ దగ్గర పడుతుండటంతో సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

ఈ క్రిస్మస్ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ జరగనుంది. షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ డిసెంబర్ 21 మరియు ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22 ఒక్క రోజు గ్యాప్ లో విడుదలవుతున్నాయి. తొలిరోజు ఈ సినిమాలు ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లను రాబడతాయో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల పై భారీ ఎక్స్ పెట్టేషన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇక రిలీజ్ డేట్స్ దగ్గర పడుతుండటంతో సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ సినిమా రికార్డ్ క్రియెట్ చేసిందని తెలుస్తోంది. ‘సలార్’ మాస్ మసాలా సినిమా కావడంతో జనాలు ఈ సినిమా వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
‘సలార్’ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు 1,53,705 టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తెలుగు వర్షన్ లో 84,000, మలయాళ వర్షన్ 42,000, హిందీలో 18,000 టిక్కెట్లు బుక్ అయ్యాయి. కన్నడ, తమిళ భాగానికి సంబంధించిన లెక్క ఇంకా తేలలేదు. ఈ సినిమా తొలిరోజు సలార్ సినిమా 150కోట్లకు పైగా వసూల్ చేస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.
అటు షారుఖ్ ఖాన్’డంకీ’ బుకింగ్ కూడా జోరుగా సాగుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన చిత్రం ‘డంకీ’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు 1,44,830 టిక్కెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. విదేశాల్లోనూ ఈ చిత్రానికి భారీ బుకింగ్స్ జరుగుతున్నాయని సమాచారం. మరి ఈ సినిమా తొలి రోజు ఎంత వసూల్ చేస్తుందో చూడాలి.
𝐄𝐧𝐭𝐞𝐫 𝐭𝐡𝐞 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐰𝐨𝐫𝐥𝐝 𝐨𝐟 𝐊𝐡𝐚𝐧𝐬𝐚𝐚𝐫 🔥#SalaarReleaseTrailer out now: https://t.co/UErO5SW9tY#SalaarCeaseFire worldwide grand release on December 22nd!#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/shLrCrCXtB
— Salaar (@SalaarTheSaga) December 18, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
