
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం హృదయపూర్వం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుంది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయినట్లు ప్రకటిస్తూ మాళవిక మోహనన్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. దీంత ఆమె పోస్ట్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. మోహన్‌లాల్, మాళవిక మధ్య వయస్సు వ్యత్యాసం గురించి కామెంట్స్ చేశారు. దీంతో తన గురించి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ పై మాళవిక తీవ్రంగా స్పందించింది. “నువ్వు ఇలా మనుషులను ఎలా తూకం వేస్తావో తెలుసా?” అంటూ కౌంటరిచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
మాళవిక మోహనన్, నటుడు మోహన్ లాల్ తో కలిసి సినిమా సెట్స్ పై ఫోటోస్ పంచుకుంది. మోహన్‌లాల్ సర్ & సత్యన్ సర్ వంటి ప్రముఖుల నుండి నేను చాలా నేర్చుకున్నాను. సినిమాలో వాళ్ళు మ్యాజిక్ చేసే విధానం నన్ను ఆకట్టుకుంది అంటూ రాసుకొచ్చింది. చాలా ప్రతిభావంతులైన వ్యక్తులతో కలిసి పనిచేశానని, తెక్కడిలోని అందమైన కొండలు, తేయాకు తోటలలో సంతోషంగా ఒక నెల గడిపానని తెలిపింది. ప్రస్తుతం మాళవిక మోహనన్ ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి :