పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) దాదాపు రెండేళ్లుగా వెండితెరపై కనిపించలేదు. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దీంతో స్క్రీన్ పై ప్రభాస్‌ను ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ చేతినిండా సినిమాలతో ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నారు. చకచకా సినిమాలను కంప్లీట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు రెబల్ స్టార్. ఇప్పటికే డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా, ఓమిక్రాన్ కారణంగా వాయిదా పడింది.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లుగా డైరెక్టర్ రాధాకృష్ణ పలుమార్లు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని మార్చి 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
Come fall in love from March 11th, 2022…
Witness the biggest war between love & destiny ?#RadheShyamOnMarch11#RadheShyam #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @radheshyamfilm pic.twitter.com/yetrqkTBeR
— UV Creations (@UV_Creations) February 2, 2022
Also Read: Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి
Brahmanandam Birthday: సినిమా తెర నుంచి డిజిటల్ పేజీల వరకూ బ్రహ్మాండమంత ఆనందం!
Panja Vaisshnav Tej : మెగా హీరో సినిమానుంచి మూడోవ సినిమా మొదటి సింగిల్ రెడీ అయ్యిందంటా..