AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: రాజాసాబ్‌గా రెబల్ స్టార్.. అదిరిపోయిన ప్రభాస్ మాస్ లుక్

ఈ సినిమా ఏకంగా 600 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సాలార్ సినిమా రెండు పార్ట్‌లు గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రభాస్ చాలా సినిమాలు కమిట్ అయిన ఉన్నాడు. వాటిలో మారుతి సినిమా ఒకటి. టాలీవుడ్ లో మారుతి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు మంచి హిట్స్ కూడా మారుతి ఖాతాలో ఉన్నాయి.

Prabhas: రాజాసాబ్‌గా రెబల్ స్టార్.. అదిరిపోయిన ప్రభాస్ మాస్ లుక్
Prabhas
Rajeev Rayala
|

Updated on: Jan 15, 2024 | 7:52 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సాలార్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా 600 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సాలార్ సినిమా రెండు పార్ట్‌లు గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రభాస్ చాలా సినిమాలు కమిట్ అయిన ఉన్నాడు. వాటిలో మారుతి సినిమా ఒకటి. టాలీవుడ్ లో మారుతి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు మంచి హిట్స్ కూడా మారుతి ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు.

సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. మాస్ లుక్ లో అదరగొట్టాడు ప్రభాస్. లుంగీ కట్టుకొని జాలీ మూడ్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంతే కాదు ఈ సినిమాకు ది రాజా సాబ్ అనే టైటిల్ ను ఖరారు. ఈ లుక్ లో ప్రభాస్ అదిరిపోయాడు. ఫ్యాన్స్‌కు ఈ లుక్‌తో ఫుల్ కిక్ ఇచ్చాడు డార్లింగ్.

ఈ సినిమాకు ముందుగా రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకుంటున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రాజాసాబ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో పాటు సలార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక రాజాసాబ్ సినిమాహు సమ్మర్ లో రిలీజే చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us