Kalki 2898 AD: కల్కి సినిమాలో ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలు..! ఒకరు కృష్ణుడు.. మరొకరు అర్జునుడు

ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది.  ఇక ఈ సినిమా నుంచి కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా కల్కి నుంచి భైరవ థీమ్ పేరుతో ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ట్రైలర్ తర్వాత సినిమా కథను ఎలాగైనా డీకోడ్ చేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో చాలామంది నటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Kalki 2898 AD: కల్కి సినిమాలో ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలు..! ఒకరు కృష్ణుడు.. మరొకరు అర్జునుడు
Kalki 2898 Ad
Follow us

|

Updated on: Jun 17, 2024 | 8:55 PM

కల్కి 2898 AD జూన్ 27న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా పై హైప్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటీవలే కల్కి ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది.  ఇక ఈ సినిమా నుంచి కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా కల్కి నుంచి భైరవ థీమ్ పేరుతో ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ట్రైలర్ తర్వాత సినిమా కథను ఎలాగైనా డీకోడ్ చేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో చాలామంది నటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరోలు కొంతమంది ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ దేవరకొండ నటిస్తున్నారని అంటున్నారు. తాజాగా మరో హీరో పేరు కూడా వినిపిస్తుంది.

కల్కి ట్రైలర్ తర్వాత రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి. దీపికా పదుకొనే కడుపులో పెరుగుతున్న బిడ్డ తరువాత కల్కి అవుతాడని అంటున్నారు. ‘మహాభారతం’ ప్రకారం పాత్రలను మార్చినట్లు ట్రైలర్‌ను బట్టి స్పష్టమవుతోంది. సినిమా కథ కూడా మహాభారతానికి సంబంధించినదే. కమల్ హాసన్ పాత్ర కంస స్ఫూర్తితో ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. అలాగే  దీపిక కడుపులో పెరిగే చిన్నారి పాత్ర కృష్ణుడి స్ఫూర్తితో ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే మహాభారతంలో  పుట్టకముందే కృష్ణుడిని చంపాలనుకున్నాడు కంసుడు. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుంది. అలాగే ప్రభాస్ మహావిష్ణువు పాత్రలో నటించవచ్చని కూడా కొందరు అంటున్నారు. అయితే ఇదంతా ఊహాగానాలు మాత్రమే. అసలు విషయాలు ఈ నెల 27న తెలుస్తాయి.

ఈ సినిమా కోసం ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి విజయ్ దేవరకొండది కాగా మరొకటి నటుడు నానిది. కృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ కల్కి పాత్రలో కనిపించనున్నారు. అలాగే దీపికా కడుపులో పెరుగుతున్న బిడ్డ కృష్ణడు, ఆ పాత్రను విజయ్ దేవరకొండ పోషించనున్నారని టాక్. ఈ సినిమాలో అర్జునుడి పాత్ర కూడా ఉండబోతుంది. ఈ పాత్ర నేచురల్ స్టార్ నాని నటించనున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ కచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. నాని విషయంలో మాత్రం సస్పెన్స్ నెలకొంది. చూడాలి మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.