Prabhas: ఆదిపురుష్ లొకేషన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమా షూటింగ్స్ గ్యాప్ లేకుండా గడిపేస్తున్నాడు డార్లింగ్..

Prabhas: ఆదిపురుష్ లొకేషన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2021 | 8:47 PM

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమా షూటింగ్స్ గ్యాప్ లేకుండా గడిపేస్తున్నాడు డార్లింగ్.. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాడు ప్రభాస్. అలాగే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటుగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. ఇటీవలే ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. భారీ బడ్జెట్‏తో రూపొందుతున్న ఈ మైథాలజీ ఫిల్మ్‏లో ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా కనిపించబోతున్నారు. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇక లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపిస్తారు. ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 11న విడుదల చేయనున్నారు .

ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరి వరకు ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  తాజాగా కూడా లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్న సన్నీ సింగ్ తీసిన సెల్ఫీ బయటకు వచ్చింది. ఈ సెల్ఫీలో రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు సన్నీ సింగ్ మరియు దర్శకుడు ఓమ్ రౌత్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాముడి పాత్రలో ప్రభాస్ ను చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అతి త్వరలోనే వస్తుందనే ఆశతో ఉన్నారు అభిమానులు.Aadipurush

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna’s The Ghost: పాన్ ఇండియా రేంజ్‌లో నాగార్జున సినిమా.. హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ.

Monal Gajjar Photos: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ‘మోనాల్ గజ్జర్’ బ్యూటీఫుల్ ఫొటోస్..

Thalapathy Vijay : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగు సినిమా.. అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్..