Prabhas: ప్రభాస్ రేంజ్ మాములుగా లేదుగా.. సందీప్ వంగా సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్… 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సినీ రంగంలో హవా కొనసాగిస్తున్న స్టార్ హీరో.. బాహుబలి ఇచ్చిన కిక్కుతో ఎవరికి అందనంత ఎత్తులో

Prabhas: ప్రభాస్ రేంజ్ మాములుగా లేదుగా.. సందీప్ వంగా సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్... 
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2021 | 8:12 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సినీ రంగంలో హవా కొనసాగిస్తున్న స్టార్ హీరో.. బాహుబలి ఇచ్చిన కిక్కుతో ఎవరికి అందనంత ఎత్తులో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.. కేవలం దక్షిణాది చిత్ర డైరెక్టర్స్ మాత్రమే కాకుండా.. ఉత్తరాది దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమా చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న డార్లింగ్.. మరిన్ని కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ఇప్పటికే వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్… ఇటీవల తన తదుపరి చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టేస్తూ.. భారీ క్రేజ్ అందుకున్న ప్రభాస్ గురించి నెట్టింట్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు మన ఇండియాలో ఏ స్టార్ హీరోకు ఇవ్వనంత రెమ్యూనరేషన్ ప్రభాస్‏కు ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల తన 25వ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ కూడా ఖారారు చేశారు. ఈ సినిమాను.. టీ సిరీస్, సందీప్ రెడ్డికి చెందిన నిర్మామ సంస్థ కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందట. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం ప్రభాస్ కళ్లు చెమ్మగిళ్లే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.. స్పిరిట్ సినిమాకు ప్రభాస్ ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్. ఇప్పటివరకు బాలీవుడ్ హీరోలు సైతం 100 కోట్ల మార్క్ దాటలేదు.. కానీ ప్రభాస్ అందుకు భిన్నంగా ఒక్క సినిమాకు ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నాడు..

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు.. ఇక ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇక సలార్, ఆదిపురుష్ అనంతరం.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసే సినిమాను పట్టాలెక్కించనున్నారు.

Also Read: Cruise Drugs Case: ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దొరకడం లేదు.. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బెయిల్ పొందిన సీలబ్రిటీల గురించి తెలుసా?

Bigg Boss 5 Telugu: లోబో ఎలిమినేట్.. గుక్కపెట్టి ఏడ్చిన విశ్వ.. అందరి గురించి తెలుసుకోమంటూ లక్కీ ఛాన్స్..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..