Tollywood: ఈ ఫోటోలో చిన్నోడు బాక్సాఫీస్ కింగ్.. అమ్మాయిల ఫాలోయింగ్ వేరే లెవెల్.. ఎవరో గుర్తుపట్టారా!
పైన ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు స్టార్ హీరో.. బాక్సాఫీస్ కింగ్. సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. కలెక్షన్ల వర్షం కురవాల్సిందే.! ఎవరో గుర్తుపట్టారా.!

ప్రభాస్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. యావత్ భారత చలనచిత్ర రంగంలో ఈ రెబెల్ స్టార్‌ను ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వేరే లెవెల్ అని చెప్పాలి. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్.. ఆ తర్వాత రిలీజైన ‘సాహో’ సినిమాతో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నాడు. ఈ రెండు సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ఎంతోమంది అభిమానులకు దగ్గరయ్యాడు. రజినీకాంత్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోల సరసన చేరిన ప్రభాస్‌కు.. చైనా, జపాన్, థాయిల్యాండ్.. ఇలా అన్ని దేశాల్లోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతోందంటే.. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
2002లో ‘ఈశ్వర్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రభాస్.. ఆ తర్వాత ‘వర్షం’ సినిమాతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ‘ఛత్రపతి’, ‘బుజ్జిగాడు’, ‘బిల్లా’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటు మాస్.. అటు క్లాస్ రెండు వర్గాల వారికి దగ్గరైన ప్రభాస్‌ను ఫ్యాన్స్ ముద్దుగా ‘డార్లింగ్’ అని పిలుచుకుంటారు. ఇదిలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ ఫ్యాన్ బేస్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
కాగా, ‘సాహో’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌కు ఇప్పటికే అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ‘ఆది పురుష్’, ‘ప్రాజెక్ట్- కే’, ‘సలార్’ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం నెట్టింట ప్రభాస్ చిన్ననాటి ఫోటోలు వైరల్‌గా మారాయి.




