AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Twitter Review : ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ..

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రామాయణ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ అద్భుత విజువల్ వండర్ మూవీలో కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నారు.

Adipurush Twitter Review : ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ..
Adipurush
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2023 | 7:43 AM

Share

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆదిపురుష్ సినిమా వచ్చేసింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా రిలీజ్ కానుంది. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రామాయణ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ అద్భుత విజువల్ వండర్ మూవీలో కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బుకింగ్స్ తోనే రికార్డు క్రియేట్ చేసింది. ఇక ప్రభాస్ లుక్ దగ్గర నుంచి మొన్నీమధ్య విడుదలైన ట్రైలర్ వరకు ఈ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. అలాగే ఈ మూవీ థియేటర్స్ తో ఒక్క సీటు హనుమంతుడి కోసం ఉంచాలని దర్శకుడు కోరగా నిర్మాతలు, థియేటర్స్ యాజమాన్యం ఒక్క సీట్ ను ఖాళీగా ఉంచనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కొన్ని ఆ బెనిఫిట్ షోలు మొదలవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ట్విట్టర్ లో సినిమా రివ్యూ ఇస్తున్నారు. అన్ని చోట్ల నుంచి ఆదిపురుష్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.మరి సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారంటే..