
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. హరిహరవీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధత్యలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ వేగంగా జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు రాబోతుంది. జూలై 24న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ సైతం షూరు చేసింది చిత్రయూనిట్. రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హరి హర వీరమల్లు సినిమా ప్రదర్శనకు సంబంధించి టికెట్లు రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది.
ఈ నెల 23వ తేదీన నిర్వహించబోయే ప్రీమియర్ షో కోసం ఒక్కో టికెట్‌ను రూ.600 వరకు విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాక, సినిమా విడుదలైన 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు పది రోజుల పాటు సాధారణ థియేటర్లలోనూ, మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ ధర రూ. 150కు పెంచగా.. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి