Pooja Hegde: పూజాహెగ్డే కిట్టీలో మరో భారీ సినిమా.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ.!

|

Oct 09, 2021 | 1:03 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు పూజా హెగ్డే. ఒక లైలాకోసం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగుకాళ్ల సుందరి.

Pooja Hegde: పూజాహెగ్డే కిట్టీలో మరో భారీ సినిమా.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా బుట్టబొమ్మ.!
Pooja
Follow us on

Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు పూజా హెగ్డే. ఒక లైలాకోసం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగుకాళ్ల సుందరి. మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ఇక స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా ఉండే పూజ. ఇటు తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో  ఫుల్ బిజీగా మారింది. తమిళ్‌లో దళపతి విజయ్‌కు జోడీగా బీస్ట్ సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. ఇక తెలుగులో పూజ నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే అక్కినేని అఖిల్‌కు జోడీగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీకూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఇప్పుడు పూజా కిట్టీలో మరో భారీ సినిమా వచ్చి చేరిందని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు.. భగత్ సింగ్’ అనే సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన డీజే, గద్దల కొండ గణేష్ సినిమాల్లో పూజాహెగ్డే నటించిన విషయం తెలిసిందే..

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ఆ టాప్ దర్శకుడి విషయంలో మంచు విష్ణు ఫ్రాడ్ చేశారు .. సంచలన కామెంట్ చేసిన మెగా బ్రదర్

MAA Elections 2021: పాపం ఆ ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

CVL Narasimha Rao: సీవీఎల్‌ నరసింహరావు సంచలన నిర్ణయం.. మా సభ్యత్వానికి రాజీనామా