AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: మాస్‌ మహరాజ్‌ నయా గ్లామర్‌ రూట్‌.. గోపీచంద్‌ మలినేని సినిమాలో ఆ అందాల తారకు ఛాన్స్‌

కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ప్రతిసారీ, సినిమాలో కొత్త కాన్సెప్ట్ ఏంటి? అని ఆలోచిస్తారు మేకర్స్. జనాల ఆలోచనలు, ఎంక్వయరీలు జస్ట్.. కాన్సెప్ట్ తో మాత్రమే ఆగడం లేదు. అంతకు మించి అన్నట్టు ఉంటున్నాయి. అందుకే ఈ సారి రవితేజ రొటీన్‌కి భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నారు.

Ravi Teja: మాస్‌ మహరాజ్‌ నయా గ్లామర్‌ రూట్‌.. గోపీచంద్‌ మలినేని సినిమాలో ఆ అందాల తారకు ఛాన్స్‌
Ravi Teja
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jul 25, 2023 | 5:39 PM

Share

కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ప్రతిసారీ, సినిమాలో కొత్త కాన్సెప్ట్ ఏంటి? అని ఆలోచిస్తారు మేకర్స్. జనాల ఆలోచనలు, ఎంక్వయరీలు జస్ట్.. కాన్సెప్ట్ తో మాత్రమే ఆగడం లేదు. అంతకు మించి అన్నట్టు ఉంటున్నాయి. అందుకే ఈ సారి రవితేజ రొటీన్‌కి భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఆయన మిస్‌ పూజా హెగ్డేతో కలిసి ఆడిపాడుతారన్న వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది. రవితేజ కెరీర్‌లో సక్సెస్‌ ఇచ్చిన కెప్టెన్లలో ఫస్ట్ బెంచ్‌ డైరక్టర్‌ గోపీచంద్‌ మలినేనిది. ఇప్పటిదాకా ఈ ఇద్దరు చేసిన సినిమాలన్నీ హిట్టే. డాన్‌ శీను, బలుపు, క్రాక్‌ సినిమాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్న కాంబినేషన్‌ వీరిద్దరిది. అందుకే ఆ సక్సెస్‌ స్ట్రీక్‌ని కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్‌ చేసుకున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటిస్తారన్నది అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న విషయం. మాస్‌ కాన్సెప్టులు, మనసుకు హత్తుకునేలా సినిమాలు తీసే డైరక్టర్ల గురించి ఆలోచిస్తారే తప్ప… ఎప్పుడూ టాప్‌ హీరోయిన్లు తన సినిమాల్లో ఉండాలని అనుకోలేదు మాస్‌ మహరాజ్‌ రవితేజ. అందుకే అప్‌కమింగ్‌ హీరోయిన్లకు, రవితేజ సినిమాల్లో ఆఫర్లు పుష్కలంగా అందుతున్నాయి.

రాశీ ఖన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ , శ్రుతి హాసన్‌… ఇలా ఎవరు రవితేజతో జోడీ కట్టినా, ఆ టైమ్‌లో వాళ్లేం టాప్‌ హీరోయిన్లు కాదు. అప్పుడప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్నవారే. మొన్నటికి మొన్న అప్‌కమింగ్‌ హీరోయిన్‌ శ్రీలీలకు ధమాకా సినిమాలో అవకాశం ఇచ్చి స్టార్‌ హీరోయిన్ల లీగ్‌లో ప్లేస్‌మెంట్‌ పదిలం చేశారు మాస్‌ మహరాజ్‌. అయితే, ఇప్పటిదాకా ఒక తీరు, ఇకమీదట ఒక తీరు అన్నట్టుంది ఆయన స్టైల్‌. ఆయన హీరోగా, గోపీచంద్‌ మలినేనితో నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టులో హీరోయిన్‌గా పూజా హెగ్డే చేస్తున్నారనే మాటే, దీనికి బిగ్‌ ఎగ్జాంపుల్‌. ఫర్దర్‌గా ఈ స్టైల్‌నే కంటిన్యూ చేస్తారా? లేకుంటే తన సినిమాల్లో అప్‌కమింగ్‌, కొత్త హీరోయిన్లకు అవకాశాలిస్తారా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్‌ చౌరస్తాలో. ప్రస్తుతం మాస్‌ మహరాజ్‌ రవితేజకి సెట్స్ మీద వరుసగా సినిమాలున్నాయి. టైగర్‌ నాగేశ్వరరావు సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈగిల్‌ సినిమా కూడా సెట్స్ మీదే ఉంది. మాస్‌ మహరాజ్‌ కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది ఈగిల్‌ మేకర్స్‌లో.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!