నితిన్‍ క్రేజీ సెంటిమెంట్‌కి పూజ హెగ్డే బ్రేక్‍ !

యంగ్ హీరో నితిన్‍ ఈ మ‌ధ్య కొత్త సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. తన ప్రతి సినిమాలోను టాప్‍ హీరోయిన్‍ వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

నితిన్‍ క్రేజీ సెంటిమెంట్‌కి పూజ హెగ్డే బ్రేక్‍ !

Hero Nithiin Next Movie : యంగ్ హీరో నితిన్‍ ఈ మ‌ధ్య కొత్త సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. తన ప్రతి సినిమాలోను టాప్‍ హీరోయిన్‍ వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. సమంతతో చేసిన ‘అఆ’, రష్మికతో చేసిన ‘భీష్మ’ బ్లాక్ బాస్ట‌ర్ విజ‌యాలు సాధించ‌డంతో.. ఇక తన సినిమాల్లో టాప్‍ హీరోయిన్‍ ఉంటే క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నాడు. నితిన్‍ నెక్ట్స్ మూవీ ‘రంగ్‍ దే’లో కూడా కీర్తి సురేష్‍ హీరోయిన్‍. ‘మహానటి’ తర్వాత ఆమె తెలుగులో చేసిన ఏకైక కమర్షియల్‍ సినిమా ఇదే.

‘రంగ్‍ దే’ అనంత‌రం అంధాధూన్‍ రీమేక్‌లో న‌టించనున్న‌ నితిన్‍ అందులో కూడా ఎవరైనా టాప్‍ హీరోయిన్‍ వుండాలనుకున్నాడు. అందుకే పూజ హెగ్డేని అప్రోచ్ అయ్యాడ‌ని సమాచారం. కానీ ఆమె టాప్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స సినిమాలు చేస్తూ కాల్షీట్లు మరో ఏడాదిన్నర వరకు ఖాళీ లేకపోవడంతో కుద‌ర‌క నో చెప్పింద‌ట‌. ఇప్పుడిక అంత క్రేజ్‍ వున్న హీరోయిన్‍ ఎవరా అని ఆలోచిస్తున్నాడ‌ట నితిన్. మరోవైపు అంధాధూన్‍లో టబు చేసిన క్యారెక్టర్‍కి నయనతారను క‌న్ఫామ్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆమె తొమ్మిది కోట్ల రెమ్యూన‌రేష‌న్ అడిగింద‌న్న వార్త‌లు కూడా వైర‌ల‌వుతున్నాయి. సింపుల్‍గా చేసేద్దామనుకున్న ఈ రీమేక్‍ని నితిన్‍ చాలా గ్రాండ్‍గా రూపొందించ‌డానికి రెడీ అయ్యాడ‌ట‌. బడ్జెట్‍ ఎక్కువయినా ఓకే కానీ ఇందులో అంతా మంచి న‌టీన‌టులు ఉండాల‌ని అయినట్లు స‌మాచారం.

 

Read More : తెలుగు బిగ్ బాస్-4 : ఆ ఇద్ద‌రు భామ‌లు ఫిక్స్ !

Click on your DTH Provider to Add TV9 Telugu