ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మతో త్రిష(Trisha Krishnan)ఒకరు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు త్రిష. ఈ అమ్మడు ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తోంది. మొన్నామధ్య త్రిష నటించిన 96 సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతే కాదు ఎన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ బ్యూటీ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో త్రిష కుందవైగా నటించారు.
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించిన అనుభవాలను పంచుకుంది ఈ బ్యూటీ. త్రిష మాట్లాడుతూ.. ఇది కమర్షియల్ అంశాలతో ఉండే హిస్టారికల్ స్టోరీ కావడంతో దుస్తులు, నడక, హావభావాలు అన్ని మార్చుకోవాల్సి వచ్చిందని అన్నారు త్రిష. ఈ సినిమాలోని కుందవై పాత్ర కోసం తాను ఆరు నెలలు ఇంట్లోనే రీహార్సిల్స్ చేశానని అన్నారు. అలాగే జయంరవి సరసన రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తాను పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటించానని అన్నారు. అలాగే ఐశ్వర్య రాయ్ తో నటించడం మంచి అనుభవం అని.. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయని అన్నారు త్రిష. ఇక కుందవై పాత్ర చాలా నేర్పించింది.. ఇక పై తాను అలానే ఉండాలని అనుకుంటున్నా అని త్రిష చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..