AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ustaad Bhagat Singh : ఫ్యాన్స్ గెట్ రెడీ..! ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తున్నాడు..!! రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Ustaad Bhagat Singh : ఫ్యాన్స్ గెట్ రెడీ..! ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తున్నాడు..!! రిలీజ్ డేట్ ఫిక్స్
Ustaad Bhagatsingh
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2026 | 4:51 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. ఓ వైపు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి బిజీ ఉంటూనే.. సమయం దొరికినప్పుడు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హరిహరవీరమల్లు సినిమాతో పాటు ఓజీ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఓజీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాగా హరిహరవీరమల్లు సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు పవన్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే..

గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ తర్వాత హరీష్, పవన్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజే డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ మేరకు అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

పవన్‌ కల్యాణ్‌ నయా చిత్రం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్ మెంట్‌ చేశారు. ఈ ఏడాది మార్చి 26న విడుదలకానుంది ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. 14 ఏళ్ల తర్వాత రిపీట్‌ అవుతున్న గబ్బర్‌సింగ్‌ కాంబినేషన్‌. దాంతో ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..