AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారణాసి కోసం నా స్టైల్ మొత్తం పక్కన పెట్టేశా..! అసలు విషయం బయట పెట్టిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరిగిపోతుంది. ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.

వారణాసి కోసం నా స్టైల్ మొత్తం పక్కన పెట్టేశా..! అసలు విషయం బయట పెట్టిన మహేష్ బాబు
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2026 | 6:11 PM

Share

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలు పెట్టారు రాజమౌళి. ఈ మేరకు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు.

ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈసినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నా అని తెలిపారు. ముఖ్యంగా తన రన్నింగ్ టెక్నీక్ మార్చుకున్నా అని తెలిపారు. ఈ సినిమాలో మహేష్ [పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు నిలబడే విధానం, నడిచే విధానం చాలా డిఫరెంట్ గ ఉంటుందట. మహేష్ తన పాత స్టైల్‌ను పక్కన పెట్టి, పూర్తిగా కొత్త బాడీ లాంగ్వేజ్‌ను అలవాటు చేసుకున్నట్టు మహేష్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

తన బాడీ లాంగ్వేజ్‌ లో మార్పు కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నారు మహేష్. మహేష్ బాబు 2024 నుంచి జర్మనీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. దాదాపు ఆరు నెలల పాటు కఠినమైన వర్క్‌షాప్స్‌లో పాల్గొన్నారు మహేష్. అయితే సినిమాలో ఆ సీన్ కేవలం 2 నిమిషాల షాట్ కోసమే అని తెలిపారు మహేష్. సినిమా సెట్ లో రాజమౌళి చేత నైస్ అనిపించుకోవడం చాలా కష్టమని.. రాజమౌళి నైస్ అన్నారంటే సీన్ పర్ఫెక్ట్ గా చేశారని అర్ధం అని మహేష్ బాబు, ప్రియాంక చెప్పుకొచ్చారు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలకానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..