AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

70కి పైగా సినిమాలు.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 54 వయసులోనూ సింగిల్

ఒకప్పుడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్స్ అంటే చాలా మంది పేర్లు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం.. సినీరంగంలో తోపు యాక్టర్. ఒకప్పుడు ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమెకు అందం, వారసత్వం, గుర్తింపు ఉన్నాయి. అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం ప్రేమ దొరకలేదు. కోరుకున్న ప్రేమ పదే పదే దూరమయ్యింది.

70కి పైగా సినిమాలు.. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. 54 వయసులోనూ సింగిల్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2026 | 3:42 PM

Share

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఈ సినీ ప్రపంచంలో రాణించడానికి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవ్వరైనా ఇండస్ట్రీలో శాశ్వతంగా కొనసాగలేరు. కొన్ని సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవ్వాల్సిందే. అలానే ఓ హీరోయిన్ ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలింది. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందం నటనతో ప్రేక్షకులను కవ్వించింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు రీఎంట్రీతో ఆకట్టుకుంది ఆ హీరోయిన్. అంతే కాదు ప్రధాని మనవరాలు కూడా.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? నేపాల్ మాజీ ప్రధాని మనవరాలు.. రాజకీయ నాయకుడి కూతురు.

90ల నాటి ఐకాన్ మనీషా కొయిరాలా. రాజవంశానికి చెందిన అమ్మాయి. అందం, అభినయంతో కుర్రకారుకును కునుకు లేకుండా చేసిన ముద్దుగుమ్మ. మనీషా నేపాల్ రాజకీయంగా ప్రభావవంతమైన కొయిరాలా కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి ప్రకాష్ కొయిరాలా ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆమె తాత బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాల్ నేపాల్ ప్రధాన మంత్రి. ఒకప్పుడు ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. అంతేకాదు.. తన నటనకు ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. 1970లో నేపాల్ లో జన్మించిన మనీషా.. ఆమె నేపాలీ చిత్రం ఫేరి భేతౌలా (1989)తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సౌదాగర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయాణం స్టార్ట్ చేసింది. దాదాపు 30 ఏళ్లు ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో మొత్తం 70 సినిమాల్లో నటించింది. మనీషా కొయిరాలా పేరు చెప్పగానే భారతీయడు, ఒకే ఒక్కడు, బొంబాయి వంటి బ్లాక్ బస్టర్స్ గుర్తుకు వస్తాయి.

అయితే సినిమా సక్సెస్ అయినా.. వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. ఆమె పేరు అప్పట్లో ఎంతో మంది స్టార్ నటులతో వినిపించింది. హీరో వివేక్ ముశ్రన్, నానా పటేకర్, వ్యాపారవేత్త సెసిల్ ఆంథోని, నటుడు ఆర్యోన్ వైద్, రెస్టారెంట్ ఓనర్ ప్రశాంత్ చౌదరి, క్రిస్పిన్ కాన్రాయ్, విప్రో వారసుడు తారిఖ్ ప్రేమ్‌జీ, అక్షయ్ కుమార్, సంగీతకారుడు సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్‌తో కూడా ఆమె పేరు వినిపించింది. ఈ క్రమంలోనే తనకంటే ఏడేళ్లు చిన్నవాడైనా వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. కానీ వీరిద్దరి వైవాహిక బంధం రెండేళ్లకే బ్రేక్ అయ్యింది. ప్రస్తుతం ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తుంది. కొన్నాళ్లపాటు క్యాన్సర్ తో పోరాడిన మనీషా.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తుంది మనిషా..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us