AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుడిగాలి సుధీర్ ఎలాంటివాడంటే.. షాకింగ్ విషయం చెప్పిన వాసంతి కృష్ణన్

బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో వాసంతి కృష్ణన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ ద్వారా మంచి గురింపు తెచ్చుకుంది. కన్నడ భాషల్లో హీరోయిన్ గా సినిమాలు చేసిన ఆమె తెలుగులో మాత్రం సీరియల్స్ లో నటించి మెప్పించింది .

సుడిగాలి సుధీర్ ఎలాంటివాడంటే.. షాకింగ్ విషయం చెప్పిన వాసంతి కృష్ణన్
Vasanthi
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2026 | 6:04 PM

Share

బిగ్ బాస్ 6 కంటెస్టెంట్, సీరియల్ వాసంతి కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అందాల భామ పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన వాసంతి, కన్నడలో ఐదు చిత్రాలలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి ప్రముఖ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ముఖ్యంగా గుప్పెడంత మనసు సీరియల్‌లోని సాక్షి పాత్ర ఆమెకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ముద్దుగుమ్మ స్వస్థలం తిరుపతి. తెలుగు అమ్మాయి అయినప్పటికీ గత 12 సంవత్సరాలుగా బెంగళూరులో నివాసం ఉంటున్నందున ఆమె భాషలో కన్నడ ప్రభావం కనిపిస్తుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసంతి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

వాసంతి కృష్ణన్ అనే పేరు ఆమె తండ్రి పేరు మీద ఏర్పడిందని, ఆ పేరుతోనే తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని ఆమె తెలిపింది. వాసంతి తండ్రి, బాలకృష్ణ మూర్తి, టీటీడీ ఉద్యోగి, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ నాయకునిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశారని వాసంతి తెలిపింది. దురదృష్టవశాత్తు, వాసంతి పదవ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఆమె తండ్రి మరణించారు. తండ్రి మరణం తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, తల్లి ప్రోత్సాహంతోనే తాను సినీ రంగంలోకి ప్రవేశించానని ఆమె తెలిపింది. కన్నడలో హీరోయిన్‌గా ఐదు చిత్రాలు చేసిన తర్వాత తెలుగులో సీరియల్ హీరోయిన్‌గా రావడం ఒక తగ్గించుకున్న అడుగుగా భావించినప్పటికీ, రాఘవేంద్ర రావు గారి బ్యానర్‌కు ఉన్న విలువ దృష్ట్యా తాను “సిరిసిరిమువ్వ” సీరియల్‌ను అంగీకరించానని వాసంతి స్పష్టం చేసింది. ఆయన నిర్మాణంలో ఏది వచ్చినా వదలనని, తన కెరీర్ దాని నుంచే ప్రారంభమైందని, కాబట్టి దానిని కెరీర్‌కు మైనస్‌గా భావించనని అన్నారు.

ఆ మధ్య కే. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో కూడా ఆమె నటించారు. తెలుగు తన మాతృభాష కావడం, హైదరాబాద్ తెలుగు పరిశ్రమలో తనకు సౌకర్యంగా ఉండటం వల్ల ఇప్పుడు తన దృష్టి పూర్తిగా తెలుగు పరిశ్రమపైనే ఉందని వాసంతి చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ గురించి ప్రస్తావించినప్పుడు, ఆయనకు ఉన్న భారీ అభిమానులు చూసి షాక్ అయ్యా అని తెలిపింది. ముఖ్యంగా లేడీస్ లో ఆయనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. టీవీ షోల్లో చూపించినట్టు ఆయన ప్లేబాయ్ కాదని అతను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడని తెలిపింది వాసంతి. పవన్ కళ్యాణ్ తన అభిమాన నటుడని కూడా ఆమె వెల్లడించారు. తన కెరీర్‌లో ఎదురైన సవాళ్ళ గురించి అడిగినప్పుడు, కన్నడలో చాలా సమస్యలను ఎదుర్కొన్నానని, అయితే వాటిని ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు