AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా కోసం బిచ్చగాడిని మాంత్రికుడిగా మార్చా.. స్టార్ హీరోకు రెండేళ్లు ఒకటే డ్రస్.. కోడిరామకృష్ణ చెప్పిన ఆసక్తికర విషయాలు

కోడి రామకృష్ణ పేరు తెలియని సగటు తెలుగు సీనీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి సందేహం ఉండదు. భక్తి ప్రధాన చిత్రాలకు తనదైన గ్రాఫిక్స్‌ సొబగులు అద్ది ఆ కాలంలోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాకు దర్శకత్వం వహించి గొప్ప పేరు సంపాదించుకున్నారాయన.

ఆ సినిమా కోసం బిచ్చగాడిని మాంత్రికుడిగా మార్చా.. స్టార్ హీరోకు రెండేళ్లు ఒకటే డ్రస్.. కోడిరామకృష్ణ చెప్పిన ఆసక్తికర విషయాలు
Kodi Ramakrishna
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2026 | 4:45 PM

Share

సినిమా ఇండస్ట్రీలో దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ చెరగని ముద్ర వేశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి చిత్రం దర్శకుడు కోడి రామకృష్ణ జీవితంలో ఒక గొప్ప స్మారకం అని, ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప వెంచర్ అని కోడి రామకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రం ఊహించినంత కమర్షియల్ విజయం సాధించనప్పటికీ, దాని నిర్మాణ విలువలు, కష్టం అసాధారణమైనవి అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన క్రెడిట్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి దక్కుతుందని రామకృష్ణ అన్నారు.. చిరంజీవి డేట్స్ ఇచ్చినప్పుడు ఒక సాధారణ కమర్షియల్ సినిమా చేయమని సలహా ఇచ్చినా, శ్యామ్ మాత్రం చిరంజీవి గారిని గ్రాఫిక్స్ సినిమాకు ఒప్పించారని కోడిరామకృష్ణ తెలిపారు.

గ్రాఫిక్స్ సినిమా చిరంజీవి లాంటి స్టార్‌తో చేయడం ఎంత కష్టమో వివరించినప్పుడు, చిరంజీవి స్వయంగా “నువ్వు కంగారు పడకు. నేను కొత్త ఆర్టిస్ట్ లా చేస్తాను, ఎన్ని రోజులైనా చేస్తాను, బట్ నా మీద గ్రాఫిక్స్ సినిమా తీయాలి” అని అన్నారు. ఈ సినిమా కథాంశం కూడా అత్యంత సంక్లిష్టమైనదని, కేవలం గ్రాఫిక్సే కాకుండా, కథాపరంగా కూడా చాలా శ్రమించి రూపొందించాం అని కోడి రామకృష్ణ వివరించారు. ఒక చిన్న షాట్‌లో 120 కాంప్లికేటెడ్ షాట్స్ ఉండేవని ఆయన తెలిపారు. అంజి సినిమా నిర్మాణానికి దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. గ్రాఫిక్స్ పనులు సింగపూర్, ఒడిశా, మలేషియా, అమెరికా వంటి వివిధ దేశాల్లో ఏకకాలంలో జరిగాయి. క్లైమాక్స్ సన్నివేశాల కోసం చిరంజీవి రెండేళ్లపాటు ఒకే డ్రెస్సును ధరించాల్సి వచ్చిందని, గ్రాఫిక్స్ మార్కులు మారకూడదనే ఉద్దేశంతో దుస్తులను ఉతకడానికి కూడా అవకాశం ఉండేది కాదని ఆయన అన్నారు. చిరంజీవి ప్రతి షాట్ కోసం కొత్త నటుడిలా సహకరించారని కోడిరామకృష్ణ అన్నారు.

చిరంజీవిని ఒరేయ్ అని పిలిచే పాత్రకు నాగబాబును ఎంపిక చేసి, ఆయనకు వృద్ధుడి వేషం వేయించారు. అలాగే, సినిమాలో మాంత్రికుడి పాత్ర కోసం ఎల్.వి. ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర ఉండే ఒక బెగ్గర్‌ను ఎంపిక చేసి నటింపచేశారట. మహేష్ బాబు సతీమణిని (నమ్రతా శిరోద్కర్) ఈ చిత్రంలోనే తొలిసారిగా పరిచయం చేశామని దర్శకుడు పేర్కొన్నారు. సినిమా విడుదలైనప్పుడు భారీ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు రాకపోయినా, కోడి రామకృష్ణకు దర్శకుడిగా మాత్రం ఈ సినిమా గొప్ప సంతృప్తినిచ్చిందని తెలిపారు. అంజి చిత్రం ప్రేక్షకుల మన్నన పొందిందని, చూడగా చూడగా చూడగా అంజి అనేది చరిత్రలో బెన్-హర్ లాగా, అలాంటి గొప్ప సినిమా అయ్యింది ఈ రోజు అని ఆయన అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు