AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan Movies: పవన్ కల్యాణ్ మూవీస్ రిలీజ్‌ డేట్‌ అప్‌డేట్స్‌… నిజంగా వస్తాయా?

హరి హర వీరమల్లు సినిమా విడుదల తేదీ మార్పులు, ఓజీ సినిమా విడుదలకు సంబంధించిన వార్తలు పవన్ కళ్యాణ్ అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, పవన్ కళ్యాణ్ డేట్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ మూవీస్ రిలీజ్ ఆలస్యమవుతోంది. ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై స్పష్టత రాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Pawan Kalyan Movies: పవన్ కల్యాణ్ మూవీస్ రిలీజ్‌ డేట్‌ అప్‌డేట్స్‌... నిజంగా వస్తాయా?
Pawan Kalyan Movies
Satish Reddy Jadda
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 19, 2025 | 7:10 PM

Share

నిర్మాతలు ఎంత గట్టిగా చెబుతున్నా పవన్ కల్యాణ్ సినిమాల రిలీజ్‌ డేట్స్ విషయంలో క్లారిటీ మాత్రం రావటం లేదు. నిన్న మొన్నటి వరకు హరి హర వీరమల్లు ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రావటం పక్కా అన్న ప్రచారం జరిగింది. వాయిదా పడుతుందన్న వార్తలు పీక్స్‌ లో ట్రెండ్ అయినా… యూనిట్ మాత్రం మార్చి 28న రిలీజ్ అన్న డేట్‌ తోనే అప్‌ డేట్స్ ఇస్తూ వచ్చింది. కానీ సడన్‌ మే 9కి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించి ఆడియన్స్‌ కు షాక్‌ ఇచ్చింది.

దీంతో మే 9కి అయినా హరి హర వీరమల్లు వచ్చే ఛాన్స్ ఉందా అన్న డౌట్స్ మళ్లీ రెయిజ్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ లో భారీ సెట్‌ సిద్ధం చేసింది యూనిట్‌. దాదాపు పది రోజులు షూటింగ్ పెండింగ్‌ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అది కూడా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కావటంతో పోస్ట్ ప్రొడక్షన్‌ కి కూడా చాలా టైమ్‌ కావాలి. పీరియాడిక్ యాక్షన్ డ్రామా క్లైమాక్స్‌ అంటే భారీ గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుంది. అసలు పవన్‌ డేట్స్ ఎప్పుడిస్తారన్న విషయం తేలితేనే మిగతా విషయాల మీద ఓ క్లారిటీ వస్తుంది.

ఇంకా హరి హర వీరమల్లు విషయంలోనూ ఎలాంటి క్లారిటీ రాకపోయినా… ఓజీ రిలీజ్ డేట్‌ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్. చిత్రయూనిట్ అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేయకపోయినా.. రిలీజ్ డేట్‌ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సెప్టెంబర్ నాటికి ఓజీ సిద్ధం అవ్వటం అంటే మామూలు విషయం కాదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. హరి హర వీరమల్లు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌, ప్రమోషన్‌ పూర్తి చేయటానికే చాలా టైమ్ పడుతుంది. ఆ తరువాత మళ్లీ ఓజీ డేట్స్ అడ్జస్ట్ చేసిన షూటింగ్ ఫినిష్ చేసేందుకు ఫ్రీగా పవన్ ఉంటారా..? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌. అయితే అభిమానులు మాత్రం ఓజీ ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్తో అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లారు దర్శకుడు సుజిత్‌.

ఓజీలో పవన్‌ లుక్స్‌ యాక్షన్‌ బ్లాక్స్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా సక్సెస్ తరువాత పవన్‌ రిటైర్మెంట్ ప్రకటించి పాలిటిక్స్‌కి డెడికేట్ అయినా  పర్లేదని ఫీల్ అవుతున్నారు. మరి అభిమానుల రిక్వెస్ట్‌ను పవన్‌ కన్సిడర్ చేస్తారేమో చూడాలి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..