ఏపీలో ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం (జూన్ 12న) ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరికొంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి పలువురు నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి స్టేట్ గెస్ట్ గా ఆహ్వనం రాగా.. పవన్ ప్రమాణ స్వీకారం చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు.
అలాగే తండ్రి ప్రమాణ స్వీకారం కోసం అకిరా, ఆద్య కూడా వచ్చారు. చాలా కాలం తర్వాత మెగా ఫ్యామిలీతో కలిసి కనిపించింది. ఇక ఎన్నికల్లో పవన్ గెలిచిన దగ్గర్నుంచి పవన్ వెంటే ఉంటున్నాడు అకీరా. ఇప్పుడు పవన్ ప్రమాణ స్వీకారం పైనే అందరి కళ్లు ఉన్నాయి. మొట్ట మొదటి సారిగా పవన్ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఆ తరుణం కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకల్లో పవన్ స్పీచ్ .. అలాగే పవన్ రాక క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూశారు. పవన్ మొదటి ప్రమాణ స్వీకారం కోసమే భారీగా మెగా అభిమానులు తరలివస్తున్నారు.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితోపాటు.. సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరుకానున్నారు. మొట్ట మొదటిసారి పవన్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అకిరా, ఆద్యతోపాటు చరణ్, సాయి ధరమ్ తేజ్ ఎంత ఆనందంగా స్పందిస్తారో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.