Pawan Kalyan: అన్నయ్య బాటలోనే వదినమ్మ.. అనాథలతో పవన్‌ సతీమణి న్యూ ఇయర్‌ వేడుకలు.. స్కూలు ఫీజులు చెల్లించి..

పవన్‌ కల్యాణ్‌ సతీమణి అనా కొణిదెల కూడా అదే బాటలోనే పయనిస్తున్నారు. ఇటీవల ఓ అనాథ శరణాలయంలో క్రిస్మస్‌ వేడుకలను జరుపుకొన్నారామె. ఆ సమయంలో చిన్నారులకు అవసరమైన నిత్యావసర సరుకులను కూడా విరాళంగా అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నారు అనా కొణిదెల

Pawan Kalyan: అన్నయ్య బాటలోనే వదినమ్మ.. అనాథలతో పవన్‌ సతీమణి న్యూ ఇయర్‌ వేడుకలు.. స్కూలు ఫీజులు చెల్లించి..
Pawan Kalyan Wife Anna Konidela
Follow us

|

Updated on: Jan 01, 2024 | 3:28 PM

పవన్‌ కల్యాణ్‌ పేరు చెప్పగానే సినిమాల కంటే ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఆపదలో ఉన్నవారికి ఎలాంటి సాయమైనా కాదనకుండా చేస్తారాయన. ఇప్పుడు జనసేన పార్టీని స్థాపనతో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసే ప్రయత్నంలో ఉన్నారు పవర్‌ స్టార్‌. ఇదిలా ఉంటే పవన్‌ కల్యాణ్‌ సతీమణి అనా కొణిదెల కూడా అదే బాటలోనే పయనిస్తున్నారు. ఇటీవల ఓ అనాథ శరణాలయంలో క్రిస్మస్‌ వేడుకలను జరుపుకొన్నారామె. ఆ సమయంలో చిన్నారులకు అవసరమైన నిత్యావసర సరుకులను కూడా విరాళంగా అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నారు అనా కొణిదెల. అందరూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటే పవన్ సతీమణి మాత్రం అనాథ బాలికలతో న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. హైదరాబాద్‌ శివార్లలోని ఘట్‌ కేసర్‌ పరిధిలో ఉన్న నారపల్లి లో ఉన్న ఫ్రెండ్స్‌ ఫౌండేషన్‌ అనాథ శరణాలయానికి వెళ్లిన అనా అక్కడి చిన్నారులతో కలిసి కేట్‌ కట్‌ చేశారు. పిల్లలకు అవసరమైన నిత్యావసర సరుకులను, సామాగ్రిని విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంలోనే కొందరు బాలికల స్కూల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరాన్ని ఫ్రెండ్స్‌ ట్రస్ట్‌ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు అనా. వెంటనే బాలికల స్కూల్‌ ఫీజు కూడా చెల్లించి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. దీంతో పవన్‌ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు అన్నా కొణిదెలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘అన్నయ్య బాటలోనే వదినమ్మ కూడా సేవా బాటలోనే పయనిస్తున్నారు’ అని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

పిల్లలతో కలిసి కేట్ కట్ చేస్తోన్న అనా కొణిదెల..

క్రిస్మస్ వేడుకలు కూడా..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..