Vakeel Saab: ‘వకీల్ సాబ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ ప్రభంజనం మొదలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు.. రికార్డుల వేట.!

Vakeel Saab Twitter Review: దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో బాలీవుడ్ మూవీ 'పింక్' ...

Vakeel Saab: 'వకీల్ సాబ్' ట్విట్టర్ రివ్యూ.. పవన్ ప్రభంజనం మొదలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు.. రికార్డుల వేట.!
మూడేళ్ల విరామం తర్వాత పవన్ వెండితెరపై కనిపించడంతో అటు అభిమానులే కాదు, మెగా కుటుంబ సభ్యులు కూడా థియేటర్ కు వచ్చి మరీ వకీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించారు.
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 09, 2021 | 10:01 AM

Vakeel Saab Twitter Review: దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్‌లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 థియేటర్లలో ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈ మూవీ బెనిఫిట్ షోస్ ప్రదర్శించగా.. ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాక ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. థియేటర్ల ముందు తమ అభిమాన హీరో కటౌట్స్‌కు ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక విదేశాల్లో కూడా పవన్ మేనియా కనిపిస్తోంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

పొలిటికల్ ఎంట్రీ తర్వాత సుదీర్ధ విరామం తీసుకుని మళ్లీ పవన్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం.. అందులోనూ బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ కావడంతో.. సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించారు. ప్రకాష్ రాజ్, శ్రుతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు.

పవన్ మార్క్ మేనరిజమ్స్‌తో సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందన్న టాక్ బయటికి వచ్చింది. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని.. సెకండ్ హాఫ్ పీక్స్ అని చెప్పొచ్చు. కోర్టు సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు. మాతృకలోని ప్రధానాంశం ఎక్కడా కూడా మిస్ కాకుండా దర్శకుడు వేణు శ్రీరాం కథను అద్భుతంగా నేరేట్ చేశారని చెప్పుకుంటున్నారు. హీరోయిన్లు తమ పాత్రల మేరకు నటించారని.. ముఖ్యంగా నివేదా థామస్ నటన సూపర్బ్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయట. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు ప్రధాన హైలైట్ అని అభిమానుల టాక్. ఫ్లాష్ బ్యాక్ మాత్రం నిరాశపరిచిందని.. అయితే ఆ తర్వాత సినిమా ఒక్కసారిగా ఊపందుకుందని ఫ్యాన్స్ టాక్. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ మనసు పెట్టి చేశారని.. పూర్తిగా వన్ మ్యాన్ షో అని అభిమానులు చెప్పుకొచ్చారు. మొత్తానికైతే వకీల్ సాబ్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు.