AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్ ఇండియన్ మూవీలో పవన్..ఔరంగ‌జేబు రోల్ హైలెట్..

2020 ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌‌కు గుర్తుండిపోయే సంవత్సరంలా కనిపిస్తోంది. ఇంక సినిమాలకు దూరపోతాడు అనుకున్న టైంలో రెండు ప్రాజెక్టులు పవర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా వారికి పండుగే. ఇప్పటికే `పింక్`రీమేక్ సంబంధించి అన్నీ పనులు సెట్ రైట్ అయ్యాయి. ఈ నెలలోనే మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. పవన్ ఈ మూవీ కోసం 20 రోజులే డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు క్రిష్‌తో మూవీ దాదాపు ఖరారయ్యింది. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ […]

పాన్ ఇండియన్ మూవీలో పవన్..ఔరంగ‌జేబు రోల్ హైలెట్..
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2020 | 10:44 PM

Share

2020 ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌‌కు గుర్తుండిపోయే సంవత్సరంలా కనిపిస్తోంది. ఇంక సినిమాలకు దూరపోతాడు అనుకున్న టైంలో రెండు ప్రాజెక్టులు పవర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా వారికి పండుగే. ఇప్పటికే `పింక్`రీమేక్ సంబంధించి అన్నీ పనులు సెట్ రైట్ అయ్యాయి. ఈ నెలలోనే మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. పవన్ ఈ మూవీ కోసం 20 రోజులే డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు క్రిష్‌తో మూవీ దాదాపు ఖరారయ్యింది. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ మూవీని నిర్మించనున్నారు. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ సర్కులేట్ అవుతోంది.

మొగ‌లాయిల కాలానికి సంబంధించిన ఓ హిస్టారికల్ కథను సిద్దం చేశాడట సెన్సుబుల్ డైరెక్టర్ క్రిష్. ఇందులో ఔరంగ‌జేబు పాత్రను చాలా పవర్‌పుల్‌గా డిజైన్ చేశాడట. అతని రూలింగ్‌ సమయానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ చాలా కొత్తగా ఉటాయని సమాచారం అందుతోంది. ఔరంగ‌జేబు పాత్ర కోసం ఓ బాలీవుడ్ న‌టుడ్ని తీసుకురావాల‌ని క్రిష్ ఆలోచిస్తున్నాడట. పవన్ కూడా క్రిష్‌ ప్రపోజల్‌కి అంగీకారం తెలిపాడట. ఇద్దరి హీరోయిన్ల అవసరం ఉన్న ఈ మూవీ కోసం ఇప్పటికే పూజా హెగ్డేను ఓకే చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి పాన్ ఇండియా రేంజ్‌లో మూవీ ప్లాన్ చేస్తున్నట్టు సన్నాహాలు చూస్తుంటేనే అర్థమవుతోంది.  ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళుతుందని సమాచారం అందుతోంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Follow Us