AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీలక సమయంలో సినిమాల్లోకి పవన్.. మీనింగ్ ఇదే

ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తానంటూ అఙ్ఞాతవాసి సినిమా తర్వాత టాలీవుడ్‌ని పూర్తిగా వదిలేసి.. ప్రజాక్షేత్రంలోకి వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మళ్ళీ సినిమాల బాట పట్టారు. దీంతో పవన్ కల్యాణ్ ప్రాధాన్యతలేమైనా మారాయా? అన్న చర్చ మొదలైంది. గతంలో సీనియర్ ఎన్టీయార్ సైతం ప్రతిపక్షానికి పరిమితమైనపుడు మళ్ళీ సినిమాలు చేశారు. ఆ కోణంలో చూస్తే పవన్ కల్యాణ్ సినిమాలు చేయడంలో తప్పేమీ లేదు. కానీ సినీ రంగంలోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన ఎంచుకున్న సమయమే […]

కీలక సమయంలో సినిమాల్లోకి పవన్.. మీనింగ్ ఇదే
Rajesh Sharma
|

Updated on: Jan 18, 2020 | 6:42 PM

Share

ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తానంటూ అఙ్ఞాతవాసి సినిమా తర్వాత టాలీవుడ్‌ని పూర్తిగా వదిలేసి.. ప్రజాక్షేత్రంలోకి వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మళ్ళీ సినిమాల బాట పట్టారు. దీంతో పవన్ కల్యాణ్ ప్రాధాన్యతలేమైనా మారాయా? అన్న చర్చ మొదలైంది. గతంలో సీనియర్ ఎన్టీయార్ సైతం ప్రతిపక్షానికి పరిమితమైనపుడు మళ్ళీ సినిమాలు చేశారు. ఆ కోణంలో చూస్తే పవన్ కల్యాణ్ సినిమాలు చేయడంలో తప్పేమీ లేదు. కానీ సినీ రంగంలోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన ఎంచుకున్న సమయమే ఆయనపై పలు రకాల చర్చలకు తెరలేపింది.

ఏపీవ్యాప్తంగా ఇపుడు రాజధాని వికేంద్రీకరణ అంశం ఉత్కంఠ రేపుతోంది. నెల రోజుల పరిణామాల తర్వాత జనవరి 20న ఏపీ అసెంబ్లీ ముందుకు రాజధాని వికేంద్రీకరణ అంశం రాబోతోంది. సో.. జనవరి 20 తేదీని ఇపుడు అత్యంత కీలకమైన రోజుగా యావత్ తెలుగు ప్రజలు భావిస్తున్నారు. ఆ రోజు జరిగే పరిణామాలు ఏపీని మరో మలుపు తిప్పే పరిస్థితి నెలకొంది.

అయితే, సరిగ్గా అదే రోజు.. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన పింక్ మూవీ ఆధారంగా తెలుగులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర చేస్తున్నారు. దానికి చాలా రోజుల క్రితమే పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పింక్ తెలుగు వెర్షన్‌ షెడ్యూల్ జనవరి 20వ తేదీన ప్రారంభం కాబోతుండగా.. పవన్ కల్యాణ్ ఆ రోజు వెండితెరకు రీ-ఎంట్రీ ఇస్తున్నారు.

జనవరి 20వ తేదీనే అటు అమరావతిలో కీలక రాజకీయ పరిణామాలు జరగనుండగా… పవన్ కల్యాణ్ కూల్‌గా హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండడంతో ఆయన ప్రాధాన్యతలేమైనా మారాయా? అన్న చర్చ మొదలైంది. ప్రజాక్షేత్రమా? లేక తొలి నుంచి అచ్చొచ్చిన సినిమా రంగమా? అంటే పవన్ కల్యాణ్ ఇపుడు రెండో దానికి మొగ్గు చూపుతున్నారని పలువురు భావిస్తున్నారు. అయితే ఆయన పార్టీ నేతలు, అభిమానుల వెర్షన్ వేరుగా వుంది. తొలి రోజు షూటింగ్‌ ప్రారంభంలో ఆయన కేవలం అప్పియరెన్స్‌కే పరిమితమవుతారని, రాజకీయ కార్యకలాపాలను సమీక్షించుకున్న తర్వాతనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళతారని చెబుతున్నారు పవన్ ఫ్యాన్స్.

జనవరి 20న జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటే.. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రాజధాని అంశంపై విపక్షాలు రోడ్డెక్కే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. మరి ఆ సందర్భంలో పవన్ కల్యాణ్.. బీజేపీ నేతలతో కలిసి ఉద్యమిస్తారా? లేక పార్టీ శ్రేణులను బీజేపీ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చి.. తాను మాత్రం సినిమా షూటింగ్‌కు వెళతారా అన్నది వేచి చూస్తే కానీ తేలని అంశం.