AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవయవదానంపై అలుపెరుగని పోరాటం.. దేశాలకే ఈ జంట ఆదర్శం

అతనో ప్రవాస భారతీయుడు.. ఇండియాలో పుట్టి అమెరికాలో సెటిలైన వ్యక్తి.. పేరు అనిల్ శ్రీవత్స.. ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయినా అవయవదాన ప్రాముఖ్యత గురించి ఎంతో తెలిసినవాడు. 2014 లో తన సోదరుడికి తన కిడ్నీని డొనేట్ చేసినప్పటినుంచి..ఆయన నిస్వార్థంగా అవయవదానం గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. ‘ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ‘ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి.. ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తూ.. 43 దేశాలు చుట్టారాయన. కారులో రోడ్డు మార్గం ద్వారా లక్ష కిలోమీటర్లకు […]

అవయవదానంపై అలుపెరుగని పోరాటం.. దేశాలకే ఈ జంట ఆదర్శం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 18, 2020 | 6:50 PM

Share

అతనో ప్రవాస భారతీయుడు.. ఇండియాలో పుట్టి అమెరికాలో సెటిలైన వ్యక్తి.. పేరు అనిల్ శ్రీవత్స.. ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయినా అవయవదాన ప్రాముఖ్యత గురించి ఎంతో తెలిసినవాడు. 2014 లో తన సోదరుడికి తన కిడ్నీని డొనేట్ చేసినప్పటినుంచి..ఆయన నిస్వార్థంగా అవయవదానం గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. ‘ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ‘ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి.. ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తూ.. 43 దేశాలు చుట్టారాయన. కారులో రోడ్డు మార్గం ద్వారా లక్ష కిలోమీటర్లకు పైగా ప్రయాణించడమే కాదు..  ఏకధాటిగా 400 రోజులు తన వాహనంలో సాగుతూ.. వివిధ దేశాల్లోని 73 వేల మందితో తన ప్రచారాన్ని షేర్ చేసుకున్నాడట.. ‘ నా సోదరుడికి  నేను ప్రేమతో కిడ్నీని దానం చేశాను..అదే ప్రేమ, అభిమానాలలోని విశేషం. విధిలేని పరిస్థితుల్లో ఉన్న ఓ అపరిచితుడికి ఒకరు అవయవదానం చేస్తే.. ఆ వ్యక్తి మీద ఆ అపరిచితుని ప్రేమ అంతాఇంతా కాదు.. అందుకే ప్రతిఫలాన్ని ఆశించక ఈ ప్రచారోద్యమాన్ని చేపట్టాను ‘ అంటాడు అనిల్ శ్రీవత్స.

ఈయన భార్య దీపాలి కూడా తన భర్త ‘సాహస యాత్ర’లో మమేకమైపోతుంది. ఆయనకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. కారులోనే వంట వండడం, నిద్రించడం అలవాటు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల్లోని స్కూళ్ళు, కాలేజీలు, రోటరీ క్లబ్బుల్లోను, ఆఫీసుల్లోనూ, కమ్యూనిటీ సెంటర్లలోనూ ప్రసంగాలు చేసే అనిల్.. అవయవదానంపై ప్రజల్లో ఉన్న భయాలు, అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే అవయవదానానికి సంబంధించిన  లీగల్, ప్రొసీజరల్ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను కూడా ఆయన సూచిస్తున్నారు. 1997 -2006 మధ్య కాలంలో  ‘అనిల్ కీ ఆవాజ్’ పేరిట అమెరికా అంతటా రేడియో టాక్ షో నిర్వహించి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు. ఇక…  తన స్వఛ్చంద సంస్థ తరఫున వచ్ఛే మార్చి నెలలో న్యూయార్క్ నుంచి ఆర్జెంటీనా వరకు కొత్త ప్రయాణానికి రెడీ అవుతున్నారు అనిల్ శ్రీవత్స.