Hari Hara Veera Mallu : ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది.. హరిహర వీరమల్లు ఎక్కడివరకు వచ్చిందంటే..!

ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఓజీ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. సాహో సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచివిడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఓజీ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతోంది.

Hari Hara Veera Mallu : ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది.. హరిహర వీరమల్లు ఎక్కడివరకు వచ్చిందంటే..!
Harihara Veeramallu
Follow us

|

Updated on: Feb 12, 2024 | 7:54 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదే.. ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఓజీ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. సాహో సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచివిడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఓజీ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ చాలా రోజుల కృత హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత అనుకోని విధంగా ఆలస్యం అవుతూ వస్తుంది. చాలా మంది ఈ సినిమా అటకెక్కేక్కేసిందని కూడా వార్తలు పుట్టించారు. పిరియాడికల్ కంటెంట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే అందాల భామ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో పవన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఆగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా హరిహర వీర మల్లు సినిమా గురించి చిత్రయూనిట్ స్పందించింది. “మా విప్లవ బందిపోటు హీరో చిత్రం హరి హర వీర మల్లు గురించిన అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులు , సినీ ప్రేమికులందరికీ… ప్రస్తుతం ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్లో  మా ప్రతిష్టాత్మక సినిమా హై ఎండ్ వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోంది. మా చిత్రం ఊహకందని రీతిలో తెరకెక్కుతోంది. కాబట్టి, దయచేసి వేచి ఉండండి , థ్రిల్‌ను ఎంజాయ్ చేయండి! అతి త్వరలో, మీరు మీ సీటు అంచున ఉండేలా ప్రత్యేక ప్రోమోను రిలీజ్ చేస్తాం అని తెలిపింది చిత్రయూనిట్.

హరిహర వీరమల్లు ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు