AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విచిత్రం.. రోడ్డుకి ఇరుపక్కల కూర్చుని పరీక్ష రాసిన విద్యార్ధులు! వీడియో

బీహార్‌లో విద్యార్ధులకు, నిరుద్యోగులకు నిర్వహించే ఏ పరీక్ష అయినా దేశ వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారుతుంది. అందుకు కారణం.. అక్కడ పరీక్షలు నిర్వహించే విధానమే. ఆ మధ్య ఓ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను ఏకంగా ఎయిర్‌పోర్టు రన్‌వేపై నిర్వహించిన సంగతి తెలిసిందే. రన్‌వేపై పరీక్షలు..

Viral Video: విచిత్రం.. రోడ్డుకి ఇరుపక్కల కూర్చుని పరీక్ష రాసిన విద్యార్ధులు! వీడియో
Students Take Test On Roadside In Bihar
Srilakshmi C
|

Updated on: Apr 14, 2026 | 6:29 PM

Share

పరీక్షలంటే సాధారణంగా నిశ్శబ్ధంగా ఉండే తరగతి గదులు, గంభీరంగా ఉండే టీచర్లు, కంగారుగా ఉండే విద్యార్ధులు.. స్కూల్, కాలేజీ ఎక్కడ చూసినా ఇదే దృశ్యం కనిపిస్తుంది. అయితే బీహార్‌లో మాత్రం విద్యార్ధులకు, నిరుద్యోగులకు నిర్వహించే ఏ పరీక్ష అయినా దేశ వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారుతుంది. అందుకు కారణం.. అక్కడ పరీక్షలు నిర్వహించే విధానమే. ఆ మధ్య ఓ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను ఏకంగా ఎయిర్‌పోర్టు రన్‌వేపై నిర్వహించిన సంగతి తెలిసిందే. రన్‌వేపై పరీక్షలు రాస్తున్న యువత వీడియోలు సామాజిక మాద్యమాల్లో తెగ చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఇంకో విచిత్ర సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.

తాజాగా బీహార్‌లోని సివాన్‌ జిల్లాలో విద్యార్థులు తరగతి గదిలో కాకుండా ఎండలో, రోడ్డు పక్కన కూర్చుని పరీక్షలు రాస్తున్న దృశ్యాలు చూసి నెటిజన్లు నోరెళ్లబెట్టారు. పరీక్షలంటే ప్రశాంతమైన తరగతి గదుల్లో ఎంతో క్రమశిక్షణతో జరుగుతాయి. ఓ ప్రైవేటు కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తమ విద్యార్థులకు ఇటీవల పరీక్షలు నిర్వహించింది. విద్యార్ధులకు సరిపడా కుర్చీలు, టేబుల్‌లు వంటి సరైన సదుపాయాలు లేకపోవడంతో తరగతి గదిలో కాకుండా ఇలా విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా కూర్చొబెట్టి పరీక్ష రాయించాల్సి వచ్చింది. అందులో కొందరు విద్యార్ధులు ఎండలో మోకాళ్లపై కూర్చొని రాస్తే.. మరికొందరు నిల్చొని పరీక్షలు రాశారు. రోడ్డుకు ఇరువైపులా విద్యార్ధులు ఇలా పరీక్ష రాసేందుకు కుస్తీలు పడ్డారు. మరోవైపు రోడ్డుపై వెళ్తున్న వాహనాలు, జనాల రకాపోకలు సాగుతున్నా.. ఆ గోల మధ్యే విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఈ ఘటనను రోడ్డుపై వెళ్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి ‘ఎక్కడైతే ఆరు బయలే తరగతి గదిగా మారుతుందో’ అనే క్యాప్షన్‌తో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ‘దీపం కింద చీకటి ఇంకా తొలగిపోలేదు, బిహార్‌లో అక్షరాస్యత తక్కువగా ఉండటానికి ఇలాంటి దుస్థితులే కారణం, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు, నాణ్యమైన విద్యా బోధన లేకపోవడం వల్లే.. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. స్మార్ట్ తరగతి గదులు, డిజిటల్ విద్య గురించి మాట్లాడే దేశంలో ఇప్పటికీ చాలా చోట్ల చాలా మందికి విద్యా ఇలాగే అందుతుంది’ అంటూ కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us