AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinders Explode: గ్యాస్ సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్‌ ఇవే!

Gas Cylinders Explode: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు గ్యాస్ సిలిండర్‌ను వాడుతుంటారు. అయితే సిలిండర్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి సిలిండర్ ఎందుకు పేలుతుంది? అందుకు కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Gas Cylinders Explode: గ్యాస్ సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్‌ ఇవే!
Gas Cylinders Explode
Subhash Goud
|

Updated on: Apr 14, 2026 | 6:25 PM

Share

Gas Cylinders Explode: ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అనేది నిత్యావసర వస్తువు. అయితే, చిన్నపాటి అజాగ్రత్త వల్ల ఇది పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. అసలు గ్యాస్ సిలిండర్లు ఎందుకు పేలుతాయి? అగ్ని ప్రమాదాల నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? అనే విషయాలపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలి.

ఇది కూడా చదవండి: AC Offer: ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి.. రిలయన్స్ అదిరిపోయే ఆఫర్లు!

గ్యాస్ సిలిండర్ ఎందుకు పేలుతుంది? ప్రధాన కారణాలు ఇవే:

సాధారణంగా గ్యాస్ సిలిండర్ దానికదే పేలిపోదు. కొన్ని కారణాల వల్లే ప్రమాదాలు జరుగుతాయి. అవేంటో తెలుసుకుందాం..

  1. గ్యాస్ లీకేజీ: రెగ్యులేటర్, హోస్ పైపు (Tube) లేదా స్టవ్ నాబ్ సరిగ్గా లేకపోవడం వల్ల గ్యాస్ లీక్ అవుతుంది. ఇది గదిలో పేరుకుపోయినప్పుడు చిన్న నిప్పురవ్వ తగిలినా భారీ పేలుడు సంభవిస్తుంది.
  2. పైపుల నాణ్యత లేకపోవడం: పాతబడిన లేదా రంధ్రాలు పడిన రబ్బరు పైపులను వాడటం వల్ల గ్యాస్ లీక్ అవుతుంది.
  3. రెగ్యులేటర్ లోపాలు: నాణ్యత లేని రెగ్యులేటర్లను వాడటం వల్ల ఒత్తిడిని నియంత్రించలేక ప్రమాదాలు జరుగుతాయి.
  4. సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్: సిలిండర్లకు కూడా గడువు తేదీ ఉంటుంది. కాలం చెల్లిన సిలిండర్ల లోహపు నాణ్యత తగ్గి, ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయే అవకాశం ఉంటుంది.
  5. వేడి ప్రాంతంలో ఉంచడం: సిలిండర్‌ను మరీ వేడిగా ఉన్న చోట లేదా నేరుగా ఎండ తగిలే చోట ఉంచితే లోపల ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. కొనుగోలు చేసేటప్పుడు:

సిలిండర్ డెలివరీ తీసుకునేటప్పుడు సీల్ సరిగ్గా ఉందో లేదో చూడండి. సిలిండర్ పైన ఉండే రింగు లోపల ‘ఎక్స్‌పైరీ డేట్’ తనిఖీ చేయండి (ఉదాహరణకు: A-26 అంటే 2026 మార్చి వరకు అని అర్థం. A, B, C, D లు నెలలను సూచిస్తాయి). డెలివరీ బాయ్ సమక్షంలోనే లీకేజీ టెస్ట్ చేయించుకోండి.

2. వంటగదిలో అమరిక:

సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగా (Vertical) మాత్రమే ఉంచాలి. పడుకోబెట్టకూడదు. గ్యాస్ స్టవ్ ఎప్పుడూ సిలిండర్ కంటే ఎత్తులో ఉండాలి. అలాగే గ్యాస్ పైపు కోసం ఎప్పుడూ ‘సురక్షా హోస్ పైప్’ మాత్రమే వాడండి. దీనిని ప్రతి రెండేళ్లకు ఒకసారి మార్చాలి.

3. వంట పూర్తయ్యాక:

రాత్రి పడుకునే ముందు, ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.

గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే ఏం చేయాలి?

ఒకవేళ మీకు గ్యాస్ వాసన వస్తున్నట్లు అనిపిస్తే, వెంటనే ఈ కింది పనులు చేయండి:

  • ప్రశాంతంగా ఉండండి: భయం వద్దు, త్వరగా స్పందించండి.
  • విద్యుత్ పరికరాలు ముట్టుకోవద్దు: లైట్లు, ఫ్యాన్లు వేయడం లేదా ఉన్న వాటిని ఆపడం చేయవద్దు. స్విచ్ నొక్కినప్పుడు వచ్చే చిన్న నిప్పురవ్వ కూడా ప్రమాదకరమే.
  • తలుపులు, కిటికీలు తెరవండి: గాలి ధారాళంగా వచ్చేలా అన్ని కిటికీలు తెరిచి ఉంచండి. తద్వారా గ్యాస్ సాంద్రత తగ్గుతుంది.
  • రెగ్యులేటర్ ఆఫ్ చేయండి: వెంటనే సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేసి, సేఫ్టీ క్యాప్‌ను పెట్టండి.
  • అగ్గిపెట్టెలు వాడొద్దు: ఆ సమయంలో గదిలో కొవ్వొత్తులు వెలిగించడం లేదా సిగరెట్లు తాగడం వంటివి చేయకూడదు.
  • గ్యాస్ వాసన వస్తున్నప్పుడు గ్యాస్ ఏజెన్సీ టోల్ ఫ్రీ నంబర్ 1906కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. చిన్నపాటి మెలకువలు పాటించి మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోండి.

ఇది కూడా చదవండి: Akshaya Tritiya 2026: ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు ఇవే..!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us