OG Movie: పవన్ కళ్యాణ్ OG సినిమా టికెట్‌కు రికార్డ్ ధర.. వేలంపాటలో లక్షా 29వేల 999 రూపాయలు..
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ వేలంపాట నిర్వహించారు.ఈ వేలంపాటలో లక్షా 29వేల 999 రూపాయలకు పవన్ అభిమాని ఆముదాల పరమేష్ బెనిఫిట్ షో తొలి టికెట్ దక్కించుకున్నారు. టికెట్ డబ్బును జనసేన ఆఫీసుకు ఇస్తామని పరమేష్ చెప్పారు. పవన్ కల్యాణ్ OG సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతోంది.
సినిమాల పట్ల భారతీయులకు ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిది. కొంతమంది అభిమానులు.. అభిమాన తారల కోసం దేవాలయాలను కూడా నిర్మించారు. అభిమాన నటుడి సినిమా విడుదల అంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా ఉండదు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా బెనిఫిట్ షో మొదటి టికెట్ ధర ఎంతో తెలుసా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ టికెట్ ధర ఎంతో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇటు సినిమా రంగంలోనూ.. అటు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం OG నీ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను ఈనెల 25వ తేదీన విడుదలకు రంగం సిద్ధం చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం.. OG సినిమా బెనిఫిట్ షో మొదటి టికెట్ కు వేలంపాట నిర్వహించింది. ఈ వేలం పాటలో 15 మంది అభిమానులు పాల్గొనగా, బెనిఫిట్ షో మొదటి టికెట్ రికార్డ్ స్థాయి ధరకు అమ్ముడుపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ధరకు 1,29, 999 రూపాయలకు పవన్ కళ్యాణ్ అభిమాని ఆముదాల పరమేష్…దక్కించుకున్నారు. వేలం పాటలో మొదటి టికెట్ గెలుచుకున్న పరమేష్ కు జబర్దస్త్ నటుడు వినోద్ అందించారు. వేలం పాటలో రికార్డు ధరకు కొనుగోలు చేసిన టికెట్ అమౌంట్ ను జనసేన పార్టీ కార్యాలయానికి అందజేస్తామని ఆముదల పరమేష్ తెలిపారు. టాలీవుడ్ లో రికార్డు క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ సినిమాగా OG నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
