Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన క్రిష్.. ఏమన్నారంటే..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Oct 05, 2021 | 8:35 AM

రీ ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ తో సాలిడ్ హిట్ అందుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన క్రిష్.. ఏమన్నారంటే..
Krish

రీ ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ తో సాలిడ్ హిట్ అందుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దాదాపు మూడేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు పవన్‌ను స్క్రీన్ మీద చూసి అభిమానులు ఊగిపోయారు. వకీల్ సాబ్ సినిమాకు మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చేశారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు. పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు క్రిష్. మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హరిహరవీరమల్లు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఆమధ్య విడుదల చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే క్రిష్ దర్శకత్వం వహించిన కొండపోలం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈక్రమంలో  తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ కొండపోలం సినిమా గురించి అలాగే పవన్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.  హరి హర వీరమల్లు సినిమా మొదలుపెట్టి ఇప్పటికే కీలక సన్నివేశాలను షూట్ చేశామన్నారు. మార్చి వరకు సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను పూర్తిచేశాం.. ఇప్పటికే షూటింగ్‌ను 50 శాతం పూర్తయ్యిందని క్రిష్ అన్నారు. ప్రస్తుతం పవన్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. నవంబర్‌లో మళ్లీ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేసి.. జనవరి వరకు సినిమా షూటింగ్‌ను ముగిస్తామని క్రిష్ తెలిపారు. క్రిష్ ఇచ్చిన అప్డేట్‌తో పవన్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prakash Raj: సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా.? మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజు సెటైర్లు

Shraddha Srinath: టాలెంటెడ్ హీరోయిన్ స్టైలిష్ ఫొటోస్.. ‘శ్రద్ధా శ్రీనాథ్‌’ వయ్యారాలపై ఓ లుక్కేయండి..

NagaChaitanya-Samantha: నెటిజన్ల పై సీనియర్ హీరోయిన్ సీరియస్.. మీ ఇష్టమొచ్చినట్టు ఉహించుకోకండి అంటూ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu