AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan Birthday: చరణ్‏కు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్.. అల్లు అర్జున్ వీడియో అదుర్స్..

రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని.. సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్ఫథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి.

Ram Charan Birthday: చరణ్‏కు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్.. అల్లు అర్జున్ వీడియో అదుర్స్..
Ram Charan, Ntr, Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2024 | 1:43 PM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన కూతురు క్లీంకార, సతీమణి ఉపాసనతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్ని వెంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు తీర్థప్రసాదాలు అందించారు పండితులు. మరోవైపు చరణ్‏కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. అలాగే చరణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రివీల్ చేస్తూ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే గేమ్ ఛేంజర్ మూవీ నుంచి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. సెలబ్రెటీస్, ఫ్యాన్స్ నెట్టింట చెర్రీకి విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ చెర్రీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు.

“రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని.. సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్ఫథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి. మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుగు వెళ్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్పూర్థిగా ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

అలాగే ఎన్టీఆర్.. “హ్యాపీ బర్త్ డే మై బ్రదర్ రామ్ చరణ్.. మరింత సంతోషం, సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

ఇక అల్లు అర్జున్ తన ఇన్ స్టా స్టోరీలో చరణ్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే బర్త్ డే చివరల్లో క్వశ్చన్ మార్క్ పెట్టారు. అలాగే వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలో సరదాగా గడిపిన మూమెంట్స్ అన్నింటిని కలిపి స్పెషల్ వీడియోగా షేర్ చేశారు. ఆ వీడియోకు ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ జత చేశారు. హ్యాపీ బర్త్ డే మై మోస్ట్ స్పెషల్ కజిన్.. లవ్ యూ ఎప్పటికీ అంటూ రాసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ షేర్ చేసిన వీడియోకు చరణ్ సతీమణి ఉపాసన స్పందిస్తూ క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం బన్నీ షేర్ చేసిన వీడియో వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.